'పీలింగ్స్' సాంగ్ వచ్చేసింది.. ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపిన బన్నీ

అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ పుష్ప2 నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ వీడియో విడుదలైంది. 'పీలింగ్స్' అంటూ సాగిన ఈ పాటలో రష్మిక, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్ తో అదరగొట్టారు. ఈ పాటను మీరు కూడా చూసేయండి.

New Update

Pushpa 2:  సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప2.  ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ఇటీవలే 'కిస్సిక్' సాంగ్ రిలీజ్ చేయగా.. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దుమ్మురేపింది. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? 

'పీలింగ్స్'  సాంగ్ 

ఇది ఇలా ఉంటే తాజాగా మూవీ నుంచి మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. 'పీలింగ్స్' ఈ డ్యూయెట్ మెలోడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విడుదలైన క్షణాల్లోనే లక్షల వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్, రష్మిక ఎనర్జిటిక్  డాన్స్ మూవ్స్ తో అదరగొట్టేశారు.  
 

Also Read: NTR హీరోయిన్ గా అచ్చ తెలుగు అందాలరాశి, కూచిపూడి నర్తకి 'వీణా రావు'

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు