Pushpa 2 : బాబోయ్.. 'పుష్ప2' టికెట్ రేట్ 3 వేలా?

నార్త్ లో 'పుష్ప2' టికెట్ రేట్లు ఊహించని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలలోని కొన్ని థియేటర్లలో హిందీ వెర్షన్ టిక్కెట్‌ల ధర  రూ.3000 వరకు ఉంది. బుక్‌మైషోలోనే ఈ ధరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బుక్‌మైషోలోనే ఈ ధరకు టికెట్లు అమ్ముడుపోతుండటం గమనార్హం.

New Update
pushpa2 (1)2

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. సౌత్ తో పాటూ నార్త్ లోనూ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. టికెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 

ఈ క్రమంలోనే కొన్ని చోట్ల 'పుష్ప2' టికెట్ రేట్లు ఊహించని విధంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబైలలోని కొన్ని థియేటర్లలో హిందీ వెర్షన్ టిక్కెట్‌ల ధర  రూ. 3000 వరకు ఉంది. బుక్‌మైషోలోనే ఈ ధరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ముంబైలోని  మైసన్ PVR: Jio వరల్డ్ డ్రైవ్ థియేటర్‌లో ఒక టికెట్‌ ధర రూ. 3000 ఉంది. బుక్‌మైషోలోనే ఈ టికెట్లను పొందే అవకాశం ఉంది. 

Also Read : రెమ్యునరేషన్ లోనూ తగ్గేదేలే..'పుష్ప2' కి బన్నీ అన్ని కోట్లు తీసుకున్నాడా?

ముంబైలోని పీవీఆర్‌, ఐనాక్స్‌ చైన్‌ లింక్‌లో ఉన్న కొన్ని స్క్రీన్స్‌లలో ఒక టికెట్‌ ధర రూ. 1500 నుంచి రూ. 2400 వరకు ఉంది. ఢిల్లీలోని PVR డైరెక్టర్స్ కట్ స్క్రీన్స్‌లో హిందీ 2D వెర్షన్ టిక్కెట్‌ ధర రూ. 2400 వరకు ఉంది. ఈ రేట్లతో పోల్చుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టికెట్ ధరలే బెటర్ అని చెప్పొచ్చు. 

తెలంగాణలో ఎంతంటే?

డిసెంబర్‌ 5వ తేదీ నుంచి 8 వరకు సింగిల్‌ స్క్రీన్లలో టికెట్‌ ధరలు రూ.150, మల్టీఫ్లెక్స్‌లలో రూ. 200 పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఉంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంచుకోవచ్చని తెలిపింది.

Also Read : ధనుష్ తో వివాదం.. దెబ్బకు సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేసిన నయనతార భర్త

publive-image

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు