అవార్డులన్నీ బన్నీకే.. రాసి పెట్టుకోండి.. ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్‌ వైరల్!

అల్లు అర్జున్ పుష్ప2 సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా పై ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ప్రశంసలు కురిపించారు. పుష్ప2 వైల్డ్ ఫైర్ ఎంటర్‌టైనర్.. అన్ని అవార్డులు అల్లు అర్జున్ కోసం రిజర్వ్ చేయబడ్డాయి అంటూ మూవీ రివ్యూ పంచుకున్నారు.

New Update

ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్.. 

ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా పుష్ప2 సినిమాను బ్లాక్ బస్టర్ గా పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా  'పుష్ప2' సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. సినిమాపై రివ్యూను పంచుకున్నారు.  

తరుణ్ ఆదర్శ్ రివ్యూ 

తరణ్ ఆదర్శ్ రివ్యూ లో  ఇలా పేర్కొన్నారు.. పుష్ప2 వైల్డ్ ఫైర్ ఎంటర్‌టైనర్.. అన్ని విధాలుగా సాలిడ్ ఫిల్మ్. అల్లు అర్జున్ నటన అద్భుతం. దర్శకుడు సుకుమార్ మ్యాజిక్ చేశాడు.. బాక్స్ ఆఫీస్ తూఫాను వచ్చేస్తుంది.  'పుష్ప 2' భారతదేశపు అత్యుత్తమ నటులలో ఒకరిగా అల్లు అర్జున్ స్థానాన్ని పటిష్టం చేస్తుంది. అల్లు అర్జున్ ట్రేడ్‌మార్క్  డైలాగ్ డెలివరీ, పారదర్శకమైన స్క్రీన్ ప్రజెన్స్ సినిమాను నిలబెట్టడానికి కీలకమైన కారకాలు. బన్నీ అసాధారణమైన నటనకు అన్ని అవార్డులు రిజర్వ్ చేయబడ్డాయిఅని ఆదర్శ్ పేర్కొన్నారు. అలాగే పుష్ప2 కోసం 4.1/2 రేటింగ్  ఇచ్చారు.   

"దర్శకుడు సుకుమార్ పై కూడా ప్రసంసలు కురిపించారు. "సీక్వెల్ చుట్టూ ఉన్న భారీ అంచనాలను సుకుమార్ పూర్తిగా తెలుసుకున్నాడు.. దానికి తగ్గట్లే..  ప్రతి సన్నీవేశంలో ఊహించని మలుపులతో నిండిన కథనాన్ని అందించడంలో అందించడంలో సక్సెస్ అయ్యారు. పార్ట్ 1 కథను గుర్తుకు తెచ్చే  డైలాగ్‌లు,  కీలక సన్నివేశాలను సుకుమార్ ఎంతో సామర్థ్యంగా చూపించారు" అని తెలిపారు. 

"అలాగే సినిమాలో  హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, వాటి కొరియోగ్రాఫి సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఇక మూవీ రన్ టైమ్ విషయానికి వస్తే.. 3 గంటల 20 నిమిషాల్లో ప్రతి సన్నివేశం కథకు ఒక విలువను జోడిస్తుంది. ప్రేక్షకులు ఆద్యంతం నిమగమయ్యేలా కథ కొనసాగుతుంది. ఎడిటర్ నవీన్ నూలి  ఎక్కడా రెస్ట్ లేకుండా మూవీని అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. 

మ్యూజిక్ ..

"మ్యూజిక్ విషయానికి వస్తే.. సాంగ్స్ వినగానే ఆకర్షించే సౌండ్ ట్రాక్ ఉండకపోయినా.. దేవి మ్యాజిక్ కంపోజిషన్‌  స్టోరీకి తగినట్లుగా పూర్తి స్థాయిలో తెరపై కనిపిస్తుంది" 

ఫహద్ ఫాసిల్ క్రూరమైన పోలీస్ అధికారిగా అద్భుతంగా నటించాడు. రష్మిక మందన కూడా అద్భుతంగా నటించారు. కథ మేల్ లీడ్స్‌పై దృష్టి సారించినప్పటికీ.. కీలక సన్నివేశాల్లో తనదైన నటనతో సినిమాలో తన ఉనికిని చాటుకుంది. 

చివిరిగా తరణ్ ఆదర్శ్ 'పుష్ప 2' ను  మిస్ చేయకూడని ఒక సినిమాటిక్ అనుభవంగా వర్ణించారు. అసాధారణమైన కథాంశం, ఉత్కంఠభరితమైన యాక్షన్, శక్తివంతమైన  ప్రదర్శనల కోసం ప్రేక్షకులు సినిమాను చూడాలని కోరారు. 

 

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు