ఒకరేమో సూపర్ హిట్ అంటున్నారు.. మరొకరేమో అట్టర్‌ ఫ్లాప్‌..ట్విట్టర్ లో 'పుష్ప' రచ్చ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప2 బజ్ నడుస్తోంది. నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఓ వైపు సూపర్ టాక్ సొంతం చేసుకుంటుండగా.. మరో వైపు అట్టర్ ప్లాప్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. అసలు పుష్ప2 గురించి నెటిజన్లు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి.

New Update

అసలు బాగోలేదు.. 

ఓ నెటిజన్ మాట్లాడుతూ.. అసలు సినిమా ఏం బాగోలేదు.. కేవలం అల్లము అర్జున్, రష్మిక మధ్య సీన్స్, అల్లు అర్జున్ తప్పా.. సినిమాలో ఏం నచ్చలేదు.. టికెట్ వేస్ట్ అని పేర్కొంది.  

మరో నెటిజన్.. సినిమా అసలేం బాగోలేదు.. బిలో యావరేజ్. నేనైతే సినిమా  మధ్యలోనే వచ్చేశాను అంటూ సినిమా పై అసహనం వ్యక్తం చేశాడు. సినిమాల పై నెటిజన్ల అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ కింది రివ్యూలను చూడండి.

మరో నెటిజన్ సినిమా చాలా బాగుంది. సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా బాగా మొదలైంది.. కానీ అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించింది అని చెప్పారు. 

మరోవైపు కొన్ని థియేటర్లలో అసలు బుకింగ్స్ కూడా లేవని అంటున్నారు నెటిజన్లు. దీనికి కారణం టికెట్ రేట్స్ అధికంగా ఉండడమని కొందరు అనగా.. మరికొంద సినిమా బాగాలేకపోవడమని అంటున్నారు. మరో మూడు, నాలుగు రోజుల తర్వాత కానీ మూవీ అసలు టాక్ ఏంటో తెలియదు. 

Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు