/rtv/media/media_files/2026/05/23/lenin-teaser-2026-05-23-13-30-33.jpg)
Lenin Teaser
Lenin Teaser: అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా సినిమా "లెనిన్" నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. సాధారణంగా టాలీవుడ్‌లో ఏ సినిమా అప్డేట్ అయినా ముందుగా అధికారిక ప్రకటన తర్వాతే వస్తుంది. కానీ ఈసారి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే టీజర్‌ను విడుదల చేశారు.
Lenin Teaser
మే 23 అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన రోజు కావడంతో ఈరోజే టీజర్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇదే రోజున అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం "మనం" విడుదలైంది. అందుకే ఆ గుర్తుగా "లెనిన్" టీజర్‌ను ఇవాళ విడుదల చేశారు.
“లెనిన్ - మనోడు వస్తున్నాడు” అనే పేరుతో వచ్చిన ఈ టీజర్‌లో ప్రేమకథతో పాటు పల్లెటూరి వాతావరణాన్ని చూపించారు. చివర్లో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు.
టీజర్ మొత్తం అఖిల్ అక్కినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉండే లవ్ సీన్స్, డైలాగ్స్, వారి కెమిస్ట్రీ చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరి మధ్య కనిపించిన క్యూట్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలో అఖిల్, భాగ్యశ్రీ ఇద్దరూ రాయలసీమ యాసలో మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. గ్రామీణ యువకుడు, గ్రామీణ యువతి పాత్రల్లో వీరి లుక్స్ కూడా న్యాచురల్ గా కనిపిస్తున్నాయి.
సినిమాలో శివాజీ, శరణ్య ప్రదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి "లెనిన్" టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
Follow Us