/rtv/media/media_files/2025/09/27/ajith-racing-movie-2025-09-27-19-40-10.jpg)
Ajith Racing Movie
Ajith Racing Movie:
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటనతో పాటు రేసింగ్‌లో కూడా ఉన్న అనుభవాన్ని ఇప్పుడు సినిమాగా మలచే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన "డ్రీమ్ ప్రాజెక్ట్"పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
అజిత్ మాట్లాడుతూ, "బ్రాడ్ పిట్ నటించిన ‘F1’ తరహాలో ఒక రేసింగ్ సినిమాను చేయాలన్న ఆలోచన ఉందని, అది కూడా తప్పకుండా ఒక రోజు జరుగుతుందని నమ్ముతున్నాను," అని చెప్పారు. సినిమాలు, రేసింగ్ రెండింటినీ సమానంగా కొనసాగిస్తున్న అజిత్‌కు రేసింగ్ అంటే ఏంతో ఆసక్తి ఉంది.
"కారు నడిపేటప్పుడు మనం ఏమి ఆలోచించం. ఎంత వేగంగా వెళ్తున్నామో కూడా తెలియదు. కానీ ట్రాక్ మిస్సయితే లేదా ప్రమాదం జరిగినప్పుడు అర్థమవుతుంది. వాహన సామర్థ్యాన్ని, మన శారీరక-మానసిక స్థితిని పరీక్షించుకుంటూ రేస్ చేస్తుంటాం. ప్రమాదాలు సహజం," అని రేసింగ్‌పై తన అనుభవాన్ని పంచుకున్నారు.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
అజిత్ రేసింగ్ పట్ల ఉన్న ప్రేమ 2000ల ప్రారంభం నుంచే అన్నది మనకు తెలిసిన విషయమే. అప్పటి నుంచే ఆయన జాతీయ, అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో పాల్గొంటూ, సినిమా కెరీర్‌కి బ్రేక్ ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. motorsportను ప్రోత్సహించడంలో కూడా ఆయన ముందుంటారు.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ఇంకా, రాబోయే రోజుల్లో భారత్ నుంచి ఒక Formula One ప్రపంచ ఛాంపియన్ వస్తాడనే ఆశను వ్యక్తం చేశారు. "మన దేశం నుంచి ఒక F1 వరల్డ్ ఛాంపియన్ వస్తాడని ఆశిస్తున్నాను. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి," అంటూ అన్నారు. ప్రస్తుతం అజిత్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో కనిపించారు. తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Follow Us