/rtv/media/media_files/2026/03/28/ranveer-singh-2026-03-28-08-35-30.jpg)
Ranveer Singh
రణ్‌వీర్ సింగ్ Ranveer Singh ప్రస్తుతం వరుస హిట్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ముఖ్యంగా Dhurandhar: The Revenge భారీ విజయంతో ఆయన పేరు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, రణ్‌వీర్ కు ప్రత్యేక గిఫ్ట్ కూడా వచ్చింది.
రూ.5 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్
ఇటీవల రణ్‌వీర్ సింగ్ ఎయిర్‌పోర్ట్‌కి కొత్త లగ్జరీ కారులో వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. సమాచారం ప్రకారం, ఈ ఖరీదైన GMC Hummer EV కారును దర్శకుడు ఆదిత్య ధర్ Aditya Dhar భార్య యామి గౌతమ్ Yami Gautam గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర సుమారు రూ.5 కోట్లు. ఈ గిఫ్ట్ ఇవ్వడానికి కారణం సినిమా సాధించిన భారీ విజయమే. ఈ సినిమా ఫ్రాంచైజ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ₹2400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని సమాచారం.
Ranveer Singh bought a GMC Hummer worth 5 crore and even celebrated a fan’s birthday. 😍🔥 pic.twitter.com/qYkviioP4Y
— CineAlpha (@CineAlpha1) March 27, 2026
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా
ప్రపంచవ్యాప్తంగా ₹1128.99 కోట్లు, భారత్‌లో ₹854.99 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. నెట్ కలెక్షన్ ₹715 కోట్లకు పైగా ఉంది. దీంతో ఈ సినిమా బాలీవుడ్‌లో టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఫ్యాన్‌తో రణ్‌వీర్ సింగ్ సింపుల్ మోమెంట్
ఎయిర్‌పోర్ట్ వద్ద రణ్‌వీర్ తన అభిమానులతో చాలా సింపుల్‌గా ప్రవర్తించాడు. ఒక ఫ్యాన్ ఆయనకు కేక్ తీసుకువచ్చి బర్త్‌డే సెలబ్రేట్ చేయాలని కోరాడు. రణ్‌వీర్ స్వయంగా కేక్ పట్టుకుని బర్త్‌డే సాంగ్ పాడి, ఆ ఫ్యాన్‌తో కలిసి కేక్ కట్ చేయించాడు. ఆ తర్వాత ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ అందరితో సరదాగా మాట్లాడాడు. ఈ సింపుల్ జెస్టర్ చూసి అభిమానులు చాలా హ్యాపీ అయ్యారు.
రికార్డుల దిశగా ‘ధురంధర్’ సిరీస్
‘ధురంధర్’ సిరీస్ వరుసగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఫ్రాంచైజ్ మొత్తం కలిపి ₹2500 కోట్లకు చేరుకునే దిశగా ఉంది. రణ్‌వీర్ సింగ్ చాలా తక్కువ సమయంలోనే రెండు 1000 కోట్ల సినిమాలు చేసిన హీరోగా నిలిచాడు. ఈ విషయంలో Shah Rukh Khan, ప్రభాస్ Prabhas తర్వాత ఈ రికార్డ్ సాధించిన మూడో హీరోగా నిలిచాడు. సినిమా విజయం మాత్రమే కాదు, తన సింపుల్ నేచర్‌తో కూడా రణ్‌వీర్ సింగ్ అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ టాప్‌లో ఉందని చెప్పాలి.
Follow Us