Aditya Dhar: ‘ధురంధర్’ కాంబో రిపీట్.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

దర్శకుడు ఆదిత్య ధర్ ‘ధురంధర్’ విజయానంతరం కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో రణ్ వీర్ సింగ్ మళ్లీ హీరోగా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 2027 మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

New Update
Aditya Dhar

Aditya Dhar

Aditya Dhar: బాలీవుడ్‌లో భారీ సెట్లూ, ఖర్చుతో కూడిన విజువల్స్ లేకుండానే పెద్ద హిట్ ఇవ్వొచ్చని దర్శకుడు ఆదిత్య ధర్ Aditya Dhar నిరూపించారు. ఆయన తెరకెక్కించిన ‘ధురంధర్’ సిరీస్‌లో రణ్ వీర్ సింగ్ Ranveer Singh హీరోగా నటించి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాల రెండు భాగాలు తక్కువ సమయంలోనే విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టాయి.

ఇప్పుడు ఈ సినిమాల రన్ ముగియడంతో, ఆదిత్య ధర్ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. ఆయన తర్వాత ఏ కథను ఎంచుకుంటారు? ఎవరు హీరోగా నటిస్తారు? అనే ఆసక్తి పెరిగింది.

Also Read: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్టేజిపై ఏడ్చేసిన హీరోయిన్.. అసలేమైందంటే?

బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘ధురంధర్’ కాంబో మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆదిత్య ధర్ ఇప్పటికే కొత్త కథపై పని ప్రారంభించారని, వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

ఈ సినిమాలో హీరో ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, రణ్ వీర్ సింగ్ మళ్లీ  నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆదిత్య ధర్ ఈ కథను రణ్ వీర్ కు వినిపించారని, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసేందుకు కొంత సమయం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!

అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో పెద్ద సినిమా రావచ్చు. ‘ధురంధర్’ విజయంతో ఆదిత్య ధర్ పేరు మరింతగా పెరిగింది. వివిధ భాషల నటులు కూడా ఆయనతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించలేదు.

ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త సినిమా 2027 మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈ సినిమా కూడా పెద్ద స్థాయిలో తెరకెక్కే అవకాశం ఉంది.

Also Read: కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

మళ్లీ రణ్ వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తే, ‘ధురంధర్’ ఇచ్చిన ప్రభావం వల్ల ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం. ఈ కాంబో మళ్లీ వస్తుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు