/rtv/media/media_files/2025/04/10/AH0p4ZyRMVUwehI113x3.jpg)
Shanmukha OTT
Shanmukha OTT: ఆది సాయికుమార్, అవికా గోర్ ముఖ్య పాత్రల్లో నటించిన డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’ సినిమా త్వరలో డిజిటల్ స్క్రీన్‌పై ప్రేక్షకులను పలకరించబోతోంది. షణ్ముగం సప్పని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికపై రెండో సారి తన లక్ పరీక్షించుకోబోతోంది ‘షణ్ముఖ’.
Also Read: టాప్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీబ్యూటీ..
ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్
ఈ సినిమాను ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా లో ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, “మరచిపోయిన కథలు... దాచిన నిధులు... పాత రహస్యాలు వెలుగులోకి రానున్నాయి” అనే ట్యాగ్‌లైన్‌తో ఆహా ఒక ఆసక్తికర ప్రమోషనల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమా మిక్స్డ్ టాక్ దొంతం చేసుకుంది. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. డివోషనల్ థ్రిల్లర్ జానర్‌లో ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇంట్లో నుండే ఈ వీకెండ్ కి చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
Also Read: Allu Ajun-Atlee: కాపీరైట్ వివాదం..అల్లు అర్జున్, అట్లీ మూవీకి బిగ్ షాక్
A cop, a scholar, and an ancient mystery!
— ahavideoin (@ahavideoIN) April 10, 2025
Dive into the forgotten tales, hidden treasures, and secrets buried deep in the forest.#Shanmukha Premieres from April 11 only on #aha #AadiSaikumar #Avikagor #Shanmukha pic.twitter.com/YvnuUBU6P3