థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? అయితే ఈ సినిమా చూడండి..స్ట్రీమింగ్ ఎక్కడంటే ? నటి అదాశర్మ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ సైకాలజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'సీడీ' (క్రిమినల్ ఆర్ డెవిల్). ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నెల 26నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్సైన వారు ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి. By Archana 29 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update C.D (Criminal Or Devil) షేర్ చేయండి C.D: కృష్ణ అన్నం దర్శకత్వంలో నటి అదాశర్మ నటించిన లేటెస్ట్ మూవీ 'సీడీ' క్రిమినల్ ఆర్ డెవిల్. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మే నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం దాదాపు విడుదలైన 6నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. Also Read: Diwali 2024: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? ఓటీటీలో 'సీడీ' ఈ నెల 26నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్సైన వారు ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి. హారర్ అంశాలతో సైకలాజికల్ థ్రిల్లర్ గా సాగిన ఈ మూవీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ బాగానే ఆకట్టుకుంది. హీరో ఇంటి నేపథ్యంలోనే ఈ సినిమా కథను సాగుతూ ఉంటుంది. సినిమాలో దయ్యాన్ని చూసి భయపడే థ్రిల్ తో పాటు మధ్య మధ్యలో రొమాంటిక్ సన్నివేశాలను కూడా ఆవిష్కరించారు. Crime or Devil: Siddu's fear of ghosts spirals after a mentally unstable woman kidnaps girls. A shocking connection reveals a darker truth, forcing Siddu to confront his demons.Watch #CriminalOrDevil on aha▶️https://t.co/oBkmCcsC6p pic.twitter.com/NboWO1EgoR — ahavideoin (@ahavideoIN) October 26, 2024 అదాశర్మ తెలుగులో హార్ట్ ఎటాక్, క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'ది కేరళ స్టోరీ' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు సమాచారం. ఇందులో అదా శర్మ, యోగిటా బిహానీ, సోనియా బాలానీ, సిద్ది ఇడ్నాని కీలక పాత్రలు పోషించారు. మతపరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. Also Read: చిరు నిజంగానే లెజెండ్.. ఈ ఫోటోలే సాక్ష్యం..! Also Read : ఇజ్రాయెల్ కొత్త స్కెచ్.. ఇదే జరిగితే యుద్ధం తప్పదా? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి