అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్ నటి సాయి పల్లవి ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ సెలెబ్రెటీ PR ఏజెన్సీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు మాట్లాడింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 26 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 'ప్రేమమ్' తో సినిమాల్లోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ సాయి పల్లవి.. అతి తక్కువ కాలంలోనే మంచి హీరోయిన్గా పేరు పొందింది. 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాను చేసే సినిమాలు కూడా చాలా సెలక్టివ్‌గా ఉంటాయి. Image Credits: sai pallavi/ Instagram 2/6 ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే సాధారణంగా సెలబ్రిటీలు తమ స్టార్డమ్, మార్కెట్‌ను పెంచుకునేందుకు పీఆర్ ఏజెన్సీలను పెట్టుకుంటారు అని టాక్. కానీ సాయిపల్లవి మాత్రం తన ఇమేజ్ ను పెంచుకోవడానికి అవసరమ్మాయే పీఆర్ ఏజెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిందట. Image Credits: sai pallavi/ Instagram 3/6 తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఈ విషయాన్ని తెలిపింది. బాలీవుడ్‌కి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెషనల్‌గా ఇమేజ్ను మరింత పెంచుకునేందుకు PR ఏజెన్సీ కావాలా..? అని అడిగారట. అలా చేస్తే ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటావని.. అందరు మీ గురించే మాట్లాడుకుంటారని చెప్పాడట . కానీ సాయిపల్లవి మాత్రం పీఆర్ ఏమీ వద్దని చెప్పిందట. Image Credits: sai pallavi/ Instagram 4/6 తన గురించి తరచూ మాట్లాడితే జనాలకు విసుగు వస్తుందని. ఖాళీగా వచ్చే పబ్లిసిటీ కంటే నిజమైన అనుబంధానికి ఎక్కువ విలువ ఇస్తాను అని చెప్పింది సాయి పల్లవి. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credits: sai pallavi/ Instagram 5/6 శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'అమరన్ '. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. Image Credits: sai pallavi/ Instagram 6/6 'అమరన్' తర్వాత సాయి పల్లవి నుంచి రానున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'తండేల్'. ఈ సినిమాలో నాగచైతన్య సరసన పల్లవి ఓ పల్లెటూరి అమ్మాయిగా అలరించబోతుంది. మరోవైపు హిందీలో రణ్ బీర్ సరసన రామాయణం చేస్తోంది. Image Credits: sai pallavi/ Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి