HBD keerthi suresh: ఐరన్ లెగ్ నుంచి మహానటి.. కీర్తి గురించి ఈ విషయాలు తెలుసా? కెరీర్ ప్రారంభంలోనే ఐరన్ లెగ్ అంటూ ముద్రపడిన కీర్తి.. తన నటన, అభినయంతో విమర్శలను ఎదిరించి ఈతరం మహానటి అనిపించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కీర్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. By Archana 17 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/9 మహానటి సావిత్రి తర్వాత.. అందం, అభినయంతో ఈ తరం సావిత్రిగా పేరు తెచ్చుకున్న అందాల తార కీర్తి సురేష్. సినీ కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే నటన మొదలు పెట్టింది. బాలనటిగా ఎన్నో సినిమాలు చేసింది. 2/9 2013లో మలయాళ చిత్రం “గీతాంజలి” సినిమాతో కీర్తి సినీ అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే తన నటనతో మంచి గుర్తింపు పొందింది మహానటి. 3/9 కానీ కెరీర్ ప్రారంభంలోనే కీర్తి చేసిన కొన్ని సినిమాలు ఆగిపోవడంతో ఆమె పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అయినప్పటికీ తాను మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు. తన నటన పై నమ్మకంతో ముందుకెళ్లింది. 4/9 'నేను శైలజ', 'నేను లోకల్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లోనూ వరుస అవకాశాలు వరించాయి ఈ ముద్దుగుమ్మకు. 2018 లో 'మహానటి' సినిమా కీర్తి ఇమేజ్ ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా కీర్తి కెరీర్ లోనే అతి పెద్ద హిట్టుగా నిలిచింది. 5/9 మహానటి సినిమాలో మహానటి సావిత్రి పాత్రను పోషించిన కీర్తి.. సావిత్రి అంటే కీర్తి సురేష్ అనేలా నటించింది. ముందుగా 'మహానటిలో' సావిత్రి పాత్ర కోసం చాలా మందిని అనుకున్నారు. కానీ ఆ అవకాశం మాత్రం కీర్తిని వరించింది. 6/9 తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సావిత్రి పాత్రను.. అచ్చం ఆమెను చూసినట్లుగానే చేసిన కీర్తి నటన సినీ ప్రియులను మైమరిపించింది. ఈ చిత్రంలో కీర్తి నటనకు 'జాతీయ పురస్కారం' వరించింది. 7/9 'మహానటి' తో ఈతరం సావిత్రిగా పేరు తెచ్చుకున్న కీర్తి కెరీర్ లో మరింత బిజీ అయిపొయింది. తెలుగు, తమిళ్లో వరుస చిత్రాలు చేసింది. ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్‌లక్ సఖి’ వంటి లేడీ ఓరియెంటెడ్ తన టాలెంట్ ను పరీక్షించుకుంది. కానీ ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 8/9 ఆ తర్వాత గతేడాది విడుదలైన 'దసరా' మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్లో కనిపించిన కీర్తి తన నటనతో ఫిదా చేసింది. ఇటీవలే ఈ సినిమాలో కీర్తి నటనకు ఉత్తమ నటిగా సైమా అవార్డు లభించింది. 9/9 టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో సత్తా చాటిన కీర్తి.. ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కీర్తి 1992 అక్టోబర్ 17న తమిళనాడులో జన్మించింది. ఈమె మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి