/rtv/media/media_files/2025/01/25/gvndG2GmO2FiyEVPupJy.jpg)
Actor Darshan:రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కి సుప్రీం కోర్టు బిగ్ షాకిచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కన పెడుతూ అతడి బెయిల్ ని రద్దు చేసింది. దర్శన్ కి బెయిల్ ఇవ్వడానికి చట్టపరమైన కారణాలేవి లేవని తెలిపింది. దర్శన్ ని త్వరగా అదుపులోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. జైల్లో దర్శన్ కి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరంలేదని ఆదేశించింది. నియమాలను ధిక్కరించి జైల్లోని నిందితులకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించింది. గతేడాది డిసెంబర్ 13న దర్శన్ కి కర్ణాటక హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) August 14, 2025
SC orders immediate arrest of Darshan, Pavithra Gowda & five others in Renukaswamy murder case
Court observed that #Darshan if out, could influence witnesses..leaving him with no option but to surrender before the sessions court once the order is issued
The actor has… https://t.co/ogjMAHhqedpic.twitter.com/FuwlSCivHO
అసలు కేసేంటి..
అయితే కొద్ది రోజుల క్రితం, దర్శన్ తన సన్నిహితురాలు నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపించాడనే కోపంతో రేణుకాస్వామి అనే అభిమానిని కిడ్నాప్ చేశాడు. అనంతరం అతడిని చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు దాదాపు 17 మంది నిందితులుగా ఉన్నారు. అప్పట్లో ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించింది.
ఈ ఘటనకు సంబంధించి దర్శన్ పై కేసు నమోదవగా.. కొన్ని రోజులపాటు జైలు జీవితాన్ని కూడా గడిపారు నటుడు దర్శన్. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ 13న అతడికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు దర్శన్ బెయిల్ ను రద్దు చేసింది. ''ఈ కేసు చాలా తీవ్రమైనది! ఇందులో చాలా మంది నిందితులు ఉన్నారు.నిందితుడి బెయిల్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది'' అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు తీర్పుతో నటుడు దర్శన్‌కు లభించిన తాత్కాలిక ఊరట ముగిసింది. మళ్ళీ అతను తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు దర్శన్ జైలులోనే ఉండాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు వెలువరించిన ఈ తీర్పు కన్నడ సినీ పరిశ్రమలో మరోసారి ప్రకంపనలు సృష్టించింది. అయితే గతంలో ఈ కేసు పై దర్శన్ జైల్లో ఉన్నప్పుడు అతడు వీఐపీ ట్రీట్మెంట్ పొందాడు. కానీ, ఈసారి అలాంటి స్పెషల్ ట్రీట్మెంట్లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను ఆదేశించింది సుప్రీం కోర్టు.
Also Read: ఇది కదా కిక్ అంటే..! కూలీ 'మోనికా' సాంగ్ పై హాలీవుడ్ హాట్ బ్యూటీ కామెంట్స్ వైరల్..
Follow Us