Dhurandhar 2: "ధురంధర్ 2" విజయంపై ఎట్టకేలకు స్పందించిన ఖాన్.. కానీ చిన్న ట్విస్ట్..!

“ధురంధర్” సినిమాల విజయంపై ఆమిర్ ఖాన్ స్పందించాడు. సినిమా చూడలేదని చెప్పినా, మంచి రివ్యూస్ విన్నానని తెలిపి టీంకి శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో అభిమానులు సంతోషంగా ఉన్నా, ఆయన పూర్తి అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు.

New Update
Dhurandhar 2

Dhurandhar 2

Dhurandhar 2: “ధురంధర్”, “ధురంధర్: ది రివెంజ్” సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. దేశం దాటి విదేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈ విజయంపై బాలీవుడ్‌లోని ప్రముఖ ఖాన్లు - షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్(Aamir Khan) మొదట్లో ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇప్పుడు ఆ నిశ్శబ్దానికి తెరపడింది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమిర్ ఖాన్‌ను ఈ సినిమాల గురించి అడగగా ఆయన స్పందించాడు. “నేను ఇంకా ఈ సినిమాను చూడలేదు. కానీ చాలా మంచి రివ్యూస్ విన్నాను. ధురంధర్, ధురంధర్ 2 రెండూ చాలా బాగా ఆడాయి. ఆ టీంకి నా శుభాకాంక్షలు” అని తెలిపారు.

ఆమిర్ ఖాన్ ఇలా స్పందించడంతో ఈ సినిమాల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఆయన స్వయంగా సినిమా చూసి తన అభిప్రాయం చెప్పాలని చాలా మంది కోరుకుంటున్నారు.

ఇంకా మిగతా ఖాన్లు కూడా ఈ సినిమాల విజయంపై స్పందిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisment
తాజా కథనాలు