/rtv/media/media_files/2026/02/12/filmfare-awards-2026-2026-02-12-12-14-03.jpg)
Filmfare Awards 2026
Filmfare Awards 2026: సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా గుర్తింపు పొందిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026 కోసం నామినేషన్ల జాబితా తాజాగా వెల్లడైంది. ఈ ఏడాదికి 70వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఫిబ్రవరి 21న ఘనంగా నిర్వహించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు అన్ని విభాగాలలో పోటీపడుతున్నాయి.
తెలుగు చిత్రాల నామినేషన్లలో ఉత్తమ చిత్రం వర్గంలో ఈ సినిమాలు ఉన్నాయి:
- 35 చిన్న కథ కాదు
- కమిటీ కుర్రోళ్లు
- హనుమాన్
- కల్కి 2898 ఏడీ
- లక్కీ భాస్కర్
- పుష్ప : ది రూల్
ఉత్తమ దర్శకుడు నామినేషన్లు:
- నాగ్ అశ్విన్ (కల్కి 2898 ఏడీ)
- నంద్ కిశోర్ (35 చిన్న కథ కాదు)
- ప్రశాంత్ వర్మ (హనుమాన్)
- సుకుమార్ (పుష్ప : ది రూల్)
- వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
- యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు నామినేషన్లు:
- అల్లు అర్జున్ (పుష్ప : ది రూల్)
- దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
- ఎన్టీఆర్ (దేవర)
- నాని (సరిపోదా శనివారం)
- సిద్ధూ జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్)
- తేజ సజ్జ (హనుమాన్)
ఉత్తమ నటి నామినేషన్లు:
- అనుపమ పరమేశ్వరన్ (టిల్లు స్క్వేర్)
- ఆషికా రంగనాథ్ (నా సామిరంగ)
- మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
- నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
- ప్రియాంక మోహన్ (సరిపోదా శనివారం)
- రష్మిక (పుష్ప : ది రూల్)
ఉత్తమ సహాయ నటుడు:
- అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
- ధనంజయ్ (జీబ్రా)
- ఫహద్ ఫాజిల్ (పుష్ప : ది రూల్)
- సత్య (మత్తు వదలరా 2)
- ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
- వినయ్ రాయ్ (హనుమాన్)
ఉత్తమ సహాయ నటి నామినేషన్లు:
- అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
- ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
- రషి సింగ్ నందు (ప్రసన్నవదనం)
- శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజీ బ్యాండు)
- శ్రద్ధా శ్రీనాథ్ (మెకానిక్ రాకీ)
- వరలక్ష్మి శరత్‌కుమార్ (హనుమాన్)
ప్రతి ఏడాది ప్రేక్షకులు, సినీ తారలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, ఈసారి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నాణ్యతను చాటుతూ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టింది. తెలుగు సినిమాలు వివిధ విభాగాల్లో బలమైన ప్రాతినిధ్యం చూపుతూ టాలీవుడ్ సత్తాను మళ్లీ ప్రదర్శిస్తున్నాయి.
Follow Us