Srikakulam: తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. చిందులేస్తున్న చిన్నారులు..!

శ్రీకాకుళం జిల్లాలో డోంకురు సముద్ర తీర ప్రాంతానికి ఓ భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. దీంతో, చుట్టుపక్కల విద్యార్థులు సముద్ర తీరానికి చేరుకుని తిమింగలంపై చిందులేస్తు ఆటాలాడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

New Update
Srikakulam: తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. చిందులేస్తున్న చిన్నారులు..!

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. ఇచ్చాపురం మండల పరిధిలోని డోంకురు సముద్ర తీర ప్రాంతానికి ఓ భారీ తిమింగలం మృత కళేబరం కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు తిమింగలాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. అదే విధంగా చుట్టుపక్కల పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు సముద్ర తీరానికి చేరుకుని తిమింగలంపై చిందులేస్తూ ఆటాలాడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తోంది : షర్మిల

ఈ వీడియోలో చిన్నారులు చేస్తున్న అల్లరి చూసి నెటిజన్లు హ్యాపిగా ఫీల్ అవుతున్నారు. చాలా ఉల్లాసంగా ఉత్సహంగా తిమింగలంపై వారు చేస్తున్న చేష్టలు చూసి నవ్వుకుంటున్నారు. అయితే, తిమింగలం గురించి తెలియక దానిపైన గంతులేస్తున్నారని..కానీ, దాని గురించి పూర్తిగా తెలిస్తే అటు వైపు కూడా వెళ్లేవారు కాదని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: టీడీపీలో టికెట్ ఫైట్.. జయనాగేశ్వర్‌రెడ్డి VS మాచాని సోమనాథ్‌..!

కాగా, సముద్రంపై ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని సార్లు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ధ్వంసమైన పడవలు, అంతు చిక్కని వస్తువులు కూడా అప్పుడప్పుడు సముద్ర తీరానికి చేరుతున్న ఘటనలు మనం చూస్తునే ఉన్నాం. సముద్ర కలుషితం పెరగడం వలనే తరచుగా తిమింగలాలు మృత్యువాత పడుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు