Betel Leaves: రోజూ తమలపాకులు తింటున్నారా..? అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే.. పాత కాలంలో మన ఇళ్లలోని పెద్దవాళ్లు ఎక్కువగా తమలపాకులు నములుతూ ఉండేవారు. భోజనం తిన్నాక రెండు తమలపాకులను నమిలేవారు. అలా ఎందుకు తినేవారని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకంటే తమలపాకుల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. By BalaMurali Krishna 03 Sep 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Betel Leaves: పాత కాలంలో మన ఇళ్లలోని పెద్దవాళ్లు ఎక్కువగా తమలపాకులు నములుతూ ఉండేవారు. భోజనం తిన్నాక రెండు తమలపాకులను నమిలేవారు. అలా ఎందుకు తినేవారని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకంటే తమలపాకుల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు రెండు తమలపాకులు తింటే వైద్యుడి అవసరమే ఉండదని కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే తమలపాకుల్లో పొగాకు, సున్నం, ఇతర పదార్థాలు కలుపుకుని తినకూడదని చెబుతున్నారు. అలా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అందవని వెల్లడించారు. కొంతమంది రోజు కిళ్లీలు తింటూ ఉంటారు. అయితే అలా కిళ్లీలు తినడం మంచిది కాదు. కేవలం ఒట్టి తమలపాకులను తింటేనే ఆరోగ్యానికి మంచిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పుష్కలంగా విటమిన్-సి, కాల్షియం.. తమలపాకుల్లో రోగనిరోధక శక్తి పెంచే విటమిస్ సి పుష్కలంగా ఉంటుంది. రోజుకు రెండు తమలపాకులు తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ సి అందుతుంది. అలాగే ఇందులో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు పాలు ఇచ్చే తల్లులు తమలపాకుల్లో వక్క పెట్టి నమిలి మింగితే ప్రయోజనం ఉంటుందంటున్నారు. జీర్ణక్రియ బాగుండటంతో పాటు మానసికంగా కూడా ధృడంగా ఉంటారట. అలాగని ఎలా పడితే అలా నమలకూడదు. ఏదైనా కానీ అతిగా తింటే ప్రమాదం. ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. తమలపాకులు తినేటప్పుడు చివర ఉన్న కాడను తీసివేసి కేవలం ఆకులు మాత్రమే తినాలి. మానసిక సమస్యలకు చెక్.. తమలపాలకు తినడం వల్ల ఆకలి బాగా వేస్తుంది. దీంతో పోషకాహారం లోపాలకు ఫుల్‌స్టాప్ పడుతుంది. పిల్లలకు జలుబు చేస్తే రెండు చుక్కల తమలపాకు రసం పాలల్లో కలిపి తాగిస్తే చాలా మంచిదంటున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి జలుబు తగ్గేలా చేస్తుంది. పిల్లలు లేదా పెద్ధవాళ్లలో పొట్ట ఉబ్బరం సమస్యను కూడా దూరం చేస్తుంది. అలాగే ఈ రసాన్ని నుదిటిపై రాసుకుంటే తలనొప్పి దరిదాపుల్లోకి కూడా రాదు. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు తమలపాకులను రోజు నములుతూ ఉండాలి. అలా నమలడం వల్ల శరీరంలో నూతన ఉత్తేజం వచ్చి యాక్టివ్‌గా ఉంటారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. NOTE: మాకు లభించిన సమాచారం మేరకే ఈ వార్త రాయడం జరిగింది. ఈ టిప్స్ పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి