Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

AP: రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్

Chandrababu: రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నారు. పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొననున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షల దృష్ట్యా విమాన ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు చేశారు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల విమానాలన్నీ యథాతథంగా నడుస్తాయని విమానాశ్రయ డైరెక్టర్‌ తెలిపారు. ఆంక్షల దృష్ట్యా ప్రయాణికులు ఉదయం 9.30 గంటల లోపే విమానాశ్రయం చేరుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు