Chandrababu: మానవత్వం లేదా? అధికారులపై చంద్రబాబు ఫైర్! వరద బాధితుల సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు. By Bhavana 03 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Chandrababu: వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని చోట్ల ఆహారం అందడం లేదని ఫిర్యాదులుఅందుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదని..కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు. నగరంలోని డివిజన్ కు ఒక సీనియర్ ఐఏఎస్ ను నియమించాని చెప్పారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని, బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్ట చివరి బాధితునికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు. వాహనాలను ఒక చోట నిలిపి ఆహార పంపిణీ చేయవద్దని, ఆ ప్రాంతాలకు వేర్వేరు వాహనాలను కేటాయించామని, అక్కడకు వెళ్లి వాటిని పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సహాయం కోసం ఏ మెసేజ్ వచ్చినా వెంటనే స్పందిస్తున్నామని తెలియజేశారు. అందరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. Also Read: గుడ్ న్యూస్ బంగారం ధర మళ్లీ తగ్గింది! ఎంతంటే.. #chandrababu-naidu #vijayawada-floods #andhra-pradesh-floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి