Kodali Nani: కొడాలి నానికి చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్..! మాజీ మంత్రి కొడాలి నానికి చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. అతడి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందితో పాటు వ్యక్తిగత సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ విషయంపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. By Jyoshna Sappogula 13 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని.. గత ప్రభుత్వంలో చాలా దూకుడుగా ఉండేవారు. ఆయన రాజకీయ ప్రస్థానం ముందుగా టీడీపీలోనే మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే, కొన్ని విభేదాల కారణంగా టీడీపీ నుండి బయటకి వచ్చి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. Also read: జగన్ పై కక్ష.. ఇలానే తీర్చుకుంటా.. రఘురామ సంచలన వ్యాఖ్యలు..! 2024 ఎన్నికల్లో కొడాలి నానితో పాటు వైసీపీ ఘోరంగా ఓటమి చెందడంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఓటమి చెందినా.. కొడాలి నాని ఏ మాత్రం తగ్గకుండా టీడీపీ దాడులు చేస్తుదంటూ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు కూడా గుప్పించారు. అయితే, తాజాగా, చంద్రబాబు సర్కార్ కొడాలి నానికి బిగ్ షాక్ ఇచ్చింది. అతడి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది తోపాటు వ్యక్తిగత సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. #kodali-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి