TDP : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భీఫామ్‌లు అందజేత.. ఆరుగురు అభ్యర్థులను మార్చిన చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భీఫామ్‌లు అందజేశారు. ఆరుగురు అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉండి ఎమ్మెల్యే సీటుపై ఉత్కంఠ తొలిగిపోయింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చంద్రబాబు బీఫాం అందచేశారు. దీంతో, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు నిరాశ ఎదురైంది. By Jyoshna Sappogula 21 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి B Forms : టీడీపీ(TDP) ఎమ్మెల్యే అభ్యర్థులకు భీఫామ్‌లు అందజేశారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఆరుగురు అభ్యర్థులను మార్చారని తెలుస్తోంది. ఉండి, మాడుగుల, కమలాపురం, వెంకటగిరి, మడకశిర, పాడేరు అభ్యర్థులను రిప్లేస్ చేశారు. ఈ క్రమంలో ఉండి ఎమ్మెల్యే సీటుపై ఉత్కంఠ తొలిగిపోయింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghu Rama Krishna Raju) కు చంద్రబాబు బీఫాం అందచేశారు. Also Read: అభ్యర్థి మార్పుపై భగ్గుమంటున్న తెలుగు తమ్మళ్ళు దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు నిరాశ ఎదురైంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజు అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే, సాయంత్రం రామరాజుతో కలిసి నియోజకవర్గ నేతలతో రఘురామ కృష్ణంరాజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామంటున్నారు. కొన్ని రోజులుగా రఘురామ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకొని రామరాజు వర్గం..ప్రస్తుతం నియోజకవర్గంలో సైలెంట్ అయింది. మరోవైపు, రామరాజు తనకు సపోర్ట్ చేస్తాడంటున్నారు రఘురామ కృష్ణంరాజు. Also Read: వేసవిలో త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఉదయం ఈ నీళ్లు తాగండి ఈ నేపథ్యంలోనే రేపు ఉండిలో రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేయనున్నారు. ఇదిలా ఉండగా, రామరాజు భవిష్యత్ కార్యాచరణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంతెన రామరాజును నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమిస్తూ తాజాగా టీడీపీ ఉత్తర్వులు జారీ చేసింది. #tdp #ap-ex-cm-chandrababu #mp-raghu-rama-krishna-raju మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి