Chandrababu : జగన్ బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ... చంద్రబాబు ఫైర్ గుడివాడలో జరుగుతున్న ‘రా.. కదలిరా’ కార్యక్రమంలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. జగన్ బిడ్డ కాదు రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదవాడు పేదరికంలో ఉంటే సీఎం జగన్ సంపన్నుడు అయ్యాడని అన్నారు. By V.J Reddy 18 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి TDP Chief Chandrababu : గుడివాడలో జరుగుతున్న ‘రా.. కదలిరా’(Raa Kadali Raa) కార్యక్రమంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) సీఎం జగన్(CM Jagan) పై విమర్శల దాడికి దిగారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన(Janasena) గెలుపు అన్‌స్టాపబుల్ అని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే.. టీడీపీ, జనసేన అధికారంలోకి రావాలని అన్నారు. జగన్ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. పేదవాడు పేదరికంలో ఉంటే సీఎం జగన్ సంపన్నుడు అయ్యాడని అన్నారు. జగన్ బిడ్డ కాదు రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: హీటెక్కిన పులివెందుల.. జగన్ కు పోటీగా వివేకా సతీమణి? పేకాటలుగా మార్చేశారు.. దేశానికి మహామహుల్ని అందించిన కృష్ణా జిల్లా అని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక కీర్తి ఉంటుందని అన్నారు. నేతలు, రచయితలు, ప్రత్రికా ప్రముఖులంతా ఈ జిల్లా వారే అని కొనియాడారు. అలాంటి జిల్లాను బూతులు, దోపిడీ, పేకాటలు, కేసినోలకు కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని ధ్వజమెత్తారు. టీడీపీ ఎవ్వరికీ భయపడదని అన్నారు. జాతికోసం పునరంకితం అవుదామని పిలుపునిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. జగనన్న బాణం ఎక్కడ.. బాబాయి హత్య కేసులో అసలు నేరస్థులు ఇంకా అరెస్ట్ కాలేదని చంద్రబాబు అన్నారు. సీబీఐపైనే వైసీపీ కేసులు పెట్టిందని పేర్కొన్నారు. ఆదాయం పెంచి ఆదుకునేదే సరైన ప్రభుత్వం.. పేదల రక్తం తాగే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరూ చూస్తున్నారని అన్నారు. జగన్ వస్తే పోలవరం ఆగిపోతుందని ఆనాడే చెప్పానని పేర్కొన్నారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని... ప్రతి యువకుడికి ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం.. జగన్ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు చంద్రబాబు. అన్న క్యాంటిన్ నుంచి విదేశీ విద్య వరకు వంద సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిందని మండిపడ్డారు. టీడీపీ ఎవ్వరికీ భయపడదు.. భయపడే ప్రసక్తే లేదని అన్నారు. పేదవాడు పేదరికంలో ఉంటే జగన్ సంపన్నుడయ్యాడని ఆరోపించారు. రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పి అపహాస్యం చేశారని అన్నారు. అహంభావం ఉండే సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. బీసీ నేతలకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వరని అన్నారు. టీడీపీ రాగానే భూరక్షణ చట్టం రద్దు చేస్తామని పేర్కొన్నారు. అప్పుల కోసం మాత్రమే ఆర్థిక మంత్రి ఉన్నారని చురకలు అంటించారు. సొంత మద్యం బ్రాండ్లతో దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇది కూడా చదవండి: AP Elections: ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం! DO WATCH LIVE: #chandrababu #cm-jagan #chandrababu-fires-cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి