Chandrababu: వైసీపీ మేనిఫెస్టోపై చంద్రబాబు సెటైర్లు

AP: వైసీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో సీఎం జగన్ 85 శాతం హామీలను కూడా నెరవేర్చలేదని అన్నారు. ఈరోజు మళ్ళీ ఇంకో మేనిఫెస్టోతో జనాన్ని మోసం చేయడానికి వచ్చాడని విమర్శించారు.

New Update
Jagan: జగన్‌కు మరో షాక్.. వైసీపీ కార్యాలయాలకు నోటీసులు

TDP Chief Chandrababu: వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చిన 730 హామీలలో ఇవి కొన్ని అని అన్నారు. గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా జగన్ నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఆ మాటకొస్తే 85 శాతం హామీలను జగన్ నెరవేర్చలేదని తెలిపారు. ఈరోజు మళ్ళీ ఇంకో మేనిఫెస్టోతో జనాన్ని మోసం చేయడానికి వచ్చాడని విమర్శించారు. మళ్ళీ ఇంకోసారి మోసపోడానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నాడని అన్నారు. నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధం అని మీరు కూడా గట్టిగా చెప్పండి అని ప్రజలకు పిలుపు నిచ్చారు.

ALSO READ: మాజీ సీఎం కేసీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు

చంద్రబాబు సీఎం జగన్ పై ట్విట్టర్ (X) లో.. "మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు.. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే... 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న నువ్వు... ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావు?" అంటూ నిలదీశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు