AP: విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వారిదే: చలసాని శ్రీనివాస్ విభజన హామీలపై పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుందన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. దక్షిణ భారతదేశానికి చెందిన ఇద్దరు ఉక్కు శాఖ మంత్రులుగా ఉన్నారని.. విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వారిదేనని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 06 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి AP: ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. రెండు రాష్ట్రాల విభజన హామీలకై రెండు రాష్ట్రాల సీఎంలు కలుస్తున్నారన్నారు. హామీలపై స్పష్టమైన అవగాహన వస్తుందని ఆశిస్తున్నానన్నారు. విభజన హామీలపై పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుందని విమర్శలు గుప్పించారు. ఏ పార్టీ కూడా రాష్ట్రాన్ని బాగుచేయాలనే ఆలోచనలో లేవని.. కృష్ణ జలాల విషయంలో ఆంధ్రకు తీరని ద్రోహం జరుగుతుందన్నారు. Also Read: చంద్రబాబు ముందు సీఎం రేవంత్ పెట్టె డిమాండ్స్.. ఇవే! రెండు రాష్ట్రాల సమస్యలను కేంద్రం కూర్చోపెట్టి పరిష్కరించవచ్చన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నాశనం చేయలని కేంద్రం చూస్తుందని.. దక్షిణ భారతదేశానికి చెందిన ఇద్దరు ఉక్కు శాఖ మంత్రులుగా ఉన్నారన్నారు. భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మ సహాయ మంత్రిగా వున్నారని.. విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వారిదేనని పేర్కొన్నారు. #chalasani-srinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి