బాలీవుడ్ హీరోలకు కేంద్రం నోటీసులు బాలీవుడ్ హీరోలైన షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీల ప్రకటనలపై వీరి ముగ్గురికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. By V.J Reddy 10 Dec 2023 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ ఈ నోటీసులు అం దుకున్న వారిలో ఉన్నారని అలహాబాద్ హైకోర్టు లఖ్ నవూ బెంచ్కు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలియజేశారు. గుట్కా సంబంధిత వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ ఆధారంగా ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ హీరోలు కొన్ని హానికారక ఉత్పత్తులకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంపై.. మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబా ద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన కోర్టు.. పిటిషనర్ అభ్యం తరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ ఇటీవల పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందన కోరుతూ కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు సమాచారం అందించారు. అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవణ్కు అక్టోబర్ 22నే షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలు గులోకి రావడం గమనార్హం. #akshay-kumar #sharukh-khan #ajaydevagan #pan-masala-adds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి