ఆర్జీవీకి బిగ్ షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. వ్యూహం సినిమాకు నో పర్మీషన్..! ఆర్జీవీకి బిగ్ షాక్ తగిలింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం మూవీకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డు నిరాకరించింది. సినిమాలో సీన్లు అన్నీ వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 02 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Censor board gave a big shock to RGV: వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీకి బిగ్ షాక్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం మూవీకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. సినిమాలో సీన్లు అన్నీ వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆ కారణంగా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు పర్మిషన్‌పై రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేయాలని నిర్ణయించారు వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం పేరుతో సినిమా తెరకెక్కించారు. ఇది రెండు పార్ట్‌లుగా ఆయన తీస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో జగన్‌పై సినిమా విడుదల చేయాలనేది వైసీపీతో పాటు దర్శకుడు వర్మ ‘వ్యూహం’ గా కనిపిస్తోంది. ‘కుట్రలకు, ఆలోచనలకు మధ్య’ అని పేర్కొనడం ద్వారా రెండు సినిమాల కథలపై ఆసక్తిని రేకెత్తించారు. వైఎస్ జగన్‌కు సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడమే ఫిల్మ్ మేకర్స్‌గా లక్ష్యంగా కనిపిస్తోంది. వ్యూహం, అలాగే పార్ట్-2 శపథం పేరుతో వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదల తేదీలను కూడా వర్మ ముందుగానే ప్రకటించారు. వ్యూహం సినిమాను నవంబర్ 10న, శపథం మూవీని జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ చెప్పారు. వైఎస్ జగన్ జీవితంలోని ప్రతి ఘటనను రెండు సినిమాల్లో చూపనున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్‌ను జైలుపాలు చేయడం, బయటికి రావడం, సొంత పార్టీ పెట్టుకోవడం, ఓదార్పు యాత్రలు, 2014 ఎన్నికల్లో అడుగు దూరంలో అధికారానికి దూరం కావడం, ఆ తర్వాత పాదయాత్ర, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, చంద్రబాబు అరెస్ట్ తదితర అంశాలన్నింటిని వ్యూహం పార్ట్-1, 2లలో తెరకెక్కంచనున్నట్టు వర్మ వెల్లడించారు. తాజాగా వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది. మూవీకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డు నిరాకరించింది . సినిమాలో సీన్లు అన్నీ వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ కారణంగా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు పర్మిషన్‌పై రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళ, మలయాళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. వైఎస్ భారతీ పాత్రను మానస రామకృష్ణ అనే కొత్త నటి పోషిస్తున్నారు. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ వ్యూహం సినిమా తీసినట్లు తెలుస్తోంది. అయితే సినిమాల్ని ఎలా తెరకెక్కించి వుంటారనే ఆసక్తి నెలకుంది. ఈ సినిమాలు జగన్‌కు రానున్న ఎన్నికల్లో ఎంతోకొంత ప్రయోజనం కలిగిస్తాయా? లేదా? అనే అంశం చర్చనీయాంశమవుతోంది. Also Read: కోడలు దాష్టీకం..మామను సజీవంగా తగలబెట్టేందుకు యత్నం.! #rgv-vyuham మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి