Kolkata Case: కోల్‌కతా కేసు విచారణపై కోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించిన CBI

కోల్కతా హత్యాచార ఘటనపై సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించింది. కేసు దర్యాప్తు పురోగతిని నివేదికలో పోందుపర్చింది. పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని సీబీఐ బయట పెట్టింది. ఘటనా స్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై సీరియస్ అయింది.

New Update
Supreme Court: సుప్రీం కోర్టులో ఆర్జీకర్‌ హత్యాచార కేసు విచారణ!

Kolkata Case: కోల్‌కతా కేసు విచారణపై సుప్రీం కోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది సీబీఐ. ఈ కేసు విచారణ బాధ్యతలు సంపత్‌ మీనాకు అప్పగించారు. సంపత్‌ మీనా 1994 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం సీబీఐ అడిషనల్ డైరెక్టర్‌గా ఆమె పని చేస్తున్నారు. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్‌ కేసులో బీజేపీ నేత, అప్పటి ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ను దోషిగా నిలబెట్టడంలో మీనాది కీ రోల్‌.

మరోవైపు మెడికల్ స్టూడెంట్స్ ఆందోళనలతో బెంగాల్ సర్కార్‌ కదిలింది. హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో భారీగా మార్పులు చేపట్టింది. ఆర్జీకర్‌ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్‌గా డాక్టర్ మానస్ కుమార్ బందోపాధ్యాయ్‌ ని నియమించింది. సూపరిండెంట్‌ పోస్టు నుంచి బుల్‌బుల్‌ ముఖోపాధ్యాయ్ తొలిగించింది. కొత్త సూపరిండెంట్‌గా సప్తర్షి ఛటర్జీకి బాధ్యతలు అప్పగించింది. చెస్ట్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్‌ అరుణబా దత్తా చౌదరి కూడా తొలిగించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు