Sri Reddy: శ్రీ రెడ్డికి బిగ్ షాక్.. కర్నూలులో కేసు నమోదు! AP: సినీనటి శ్రీ రెడ్డిపై కేసు నమోదు చేశారు కర్నూల్ పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By V.J Reddy 20 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Sri Reddy: సినీనటి శ్రీ రెడ్డిపై కేసు నమోదు చేశారు కర్నూల్ పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీరెడ్డిపై సెక్షన్ 352, 353 BNS,66 ITA-2000-2008 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. శ్రీ రెడ్డి వైసీపీకి చాలా రోజులుగా మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ అనేక పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అనేక సార్లు టీడీపీ, జనసేనతో పాటు వైసీపీని వ్యతిరేకించే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల సమయంలో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అనేక సార్లు పోస్టులు పెట్టారు. కానీ ఆమె అంచనా తప్పింది. టీడీపీ విజయం సాధించింది. అప్పటి నుంచి శ్రీ రెడ్డిపై సోషల్ మీడియాలో కూటమి సపోర్టర్లు ట్రోల్స్ చేస్తున్నారు. శ్రీ రెడ్డి కూడా కూటమి సర్కార్ పై నిత్యం విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమెపై టీడీపీ నేత రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? శ్రీ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి