TS News: 70 కుక్కలకు విషమిచ్చి చంపేశారు.. సర్పంచ్ పై కేసు..!!

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 70కుక్కలకు విషం ఇచ్చి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.మాచర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యానిమల్ యాక్టివిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామ సర్పంచ్ పై కేసు నమోదు అయ్యింది.

New Update
Madhya Pradesh: పెంపుడు కుక్కలే ప్రాణం తీశాయా? ఆవేశం అదుపు తప్పిందా?

TS News: ఈమధ్య కాలంలో వీధికుక్కల స్వైర విహారం తరచుగా వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. చాలా చోట్ల పసివాళ్లను చంపిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజులు క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగులు వీధి కుక్కలకు విషమిచ్చి చంపారు. అర్థరాత్రి నాటుతుపాకీతో కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఏకంగా 70 కుక్కలకు విషమిచ్చి చంపేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే కొందరు యానిమల్ యాక్టివిస్టులు సర్పంచ్ పై ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు అయ్యింది. నిజామాబాద్ జిల్లా మాచర్లలో సుమారు 70కుక్కలను చంపి పడేయడం కనిపించింది. వాటికి విషం ఇంజెక్ట్ చేసి చంపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని యాక్టివిస్టులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో జంతువుల క్రూరత్వ నిరోధకచట్టం కింద కేసు నమోదు చేశారు.

యానిమల్ యాక్టివిస్టు సాయిశ్రీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..మాచర్ల గ్రామంలో జంతువులపై దారుణ ఘటన జరిగిందని..ఫిబ్రవరి 15,16 తేదీల్లో నాకు సమాచారం అందిందని ఫిర్యాదులో పేర్కొంది. సుమారు 70కుక్కలను మాచర్ల గ్రామంలో దారుణంగా చంపేశారని తెలిసింది. విషయంపై ఆరా తీయగా సర్పంచ్, కార్యదర్శి మరికొందరు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. వీధి కుక్కలకు విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేయించడానికి కొందరు పురామాయించినట్లు తెలిసిందని వివరించారు.

ఇది కూడా చదవండి: హెలికాప్టర్ లో మేడారం.. ఎలా వెళ్ళాలో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు