Portugal: రోడ్లపై వరదలా వైన్ పారడం చూశారా..?.. వీడియో వైరల్

భారీ వర్షాలు వచ్చినప్పుడు రోడ్లపై పారే వరదని చూస్తుంటాం. మరి ఎపుడైనా రోడ్లపై వరదలా వైన్ పారడం చూశారా..? నార్మల్ గా అయితే మద్యం ఏరులా పారుతోందని రాజకీయ నాయకుల స్పీచుల్లో వింటుంటాం.. బయట అలా జరగడమైతే మనం ఎప్పుడు చూసుండం కదా.. కానీ ఇలా మద్యం ఏరులై పారడాన్ని.. కాదు కాదు మద్యం వరదల్నే చూసారు కొందరు .. ఇదేంటి మద్యం రోడ్లపై పారడమేంటి..? ఇదేం వింత.. అసలు ఎక్కడ జరిగిందిది అనుకుంటారా..?

New Update
Portugal: రోడ్లపై వరదలా వైన్ పారడం చూశారా..?.. వీడియో వైరల్

Red Wine Floods in Portugal: భారీ వర్షాలు వచ్చినప్పుడు రోడ్లపై పారే వరదని చూస్తుంటాం. మరి ఎపుడైనా రోడ్లపై వరదలా వైన్ పారడం చూశారా..? నార్మల్ గా అయితే మద్యం ఏరులా పారుతోందని రాజకీయ నాయకుల స్పీచుల్లో వింటుంటాం.. బయట అలా జరగడమైతే మనం ఎప్పుడు చూసుండం కదా.. కానీ ఇలా మద్యం ఏరులై పారడాన్ని.. కాదు కాదు మద్యం వరదల్నే చూసారు కొందరు .. ఇదేంటి మద్యం రోడ్లపై పారడమేంటి..? ఇదేం వింత.. అసలు ఎక్కడ జరిగిందిది అనుకుంటారా..?

2 మిలియన్ లీటర్ల వైన్ వృథా..

ఈ ఆశ్చర్యపోయే ఘటన పోర్చుగల్ లో జరిగింది. పోర్చుగల్‌లోని లెవీరా సిటీ రోడ్లపై రెడ్ వైన్ వరదలా పారింది.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిటీలోని డిస్టిలరీ 2 మిలియన్ లీటర్ల వైన్‌ను ఎగుమతి చేసేందుకు రెడీ చేసింది. పెద్ద బ్యారెన్లలో స్టోర్ చేసిన వైన్ ని ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా బ్యారెన్స్ అనుకోకుండా పేలిపోయాయి. దీంతో వైన్ కొండ ప్రాంతం నుండి వరదలా కిందకు ప్రవహించింది. లక్షలాది లీటర్ల వైన్ వీధుల్లో ప్రవహించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇళ్లు, కాలువ, రోడ్లలో ప్రవహిస్తున్న వైన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 11న జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.

ఇళ్లలోకి ప్రవహించిన వైన్ వరద..

ఎంత వైన్ నేల పాలైందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒలింపిక్ క్రీడల్లో స్విమ్మింగ్ పూల్‌ను నింపగలిగేంత వైన్ రోడ్డుపై ప్రవహించింది. ఎగువ ప్రాంతాల నుంచి వైన్ వరదలా ఇళ్లలోకి ప్రవహించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు... పక్కనే ఉన్నసెర్టిమా నదిని వైన్ నదిగా మారకుండా, వరదను దారి మళ్లించి సమీపంలోని పొలాల్లోకి ప్రవహించేలా చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. భూములు ఎందుకు పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఘటనపై లెవిరా డిస్టిలరీ క్షమాపణలు చెప్పింది. వైన్ ప్రభావంతో చెడిపోయిన భూములకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. భూములు బాగు చేయించేందుకు అవసరమైన సాయం చేస్తామని ప్రకటించింది.

Also Read: కాలు దువ్విన కిమ్…జపాన్ ప్రధాని హెచ్చరిక .!!

Advertisment
Advertisment
తాజా కథనాలు