ఒకే నెంబర్‎పై లక్షల రిజిస్ట్రేషన్లు..! ఆయుష్మాన్ భారత్ పథకంపై కాగ్ షాకింగ్ రిపోర్టు

ఆయుష్మాన్ భారత్ పథకం గురించి కాగ్ తన రిపోర్టులో షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఈ పథకంలో, దాదాపు 7.5 లక్షల మంది లబ్ధిదారులు ఒకే మొబైల్ నంబర్‌లో నమోదు చేసుకున్నారని షాకింగ్ విషయాలు తెలిశాయి. లోక్‌సభలో సమర్పించిన ఆయుష్మాన్ భారత్ పథకం ఆడిట్ రిపోర్టు లో కాగ్ ఈ సమాచారాన్ని వెల్లడించింది.

author-image
By Bhoomi
New Update
ఒకే నెంబర్‎పై లక్షల రిజిస్ట్రేషన్లు..! ఆయుష్మాన్ భారత్ పథకంపై కాగ్ షాకింగ్ రిపోర్టు

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే CAG రిపోర్టు లో, ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY)కి సంబంధించి సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ పథకంలో, దాదాపు 7.5 లక్షల మంది లబ్ధిదారులు ఒకే మొబైల్ నంబర్‌లో నమోదు చేసుకున్నారని షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ మొబైల్ నంబర్‌లోని మొత్తం 10 నంబర్‌లు 9 (9999999999) అంకెలను కలిగి ఉన్నాయి. లోక్‌సభలో సమర్పించిన ఆయుష్మాన్ భారత్ పథకం ఆడిట్ రిపోర్టు లో కాగ్ ఈ సమాచారాన్ని వెల్లిబుచ్చింది.

అసలు విషయానికి వస్తే సుమారు 7.50 లక్షల మంది ఒకే మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకున్నారు. ఆ నంబర్ కూడా తప్పుడు నెంబర్ ని తేలింది. అంటే, ఆ నంబర్‌కు సిమ్ కార్డ్ లేదు. BIS డేటాబేస్ విశ్లేషణలో, ఇంత పెద్ద సంఖ్యలో నకిలీ రిజిస్ట్రేషన్లు కనుగొన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఇదే విధమైన మరో కేసు కూడా రిపోర్టు లో ప్రస్తావించారు, ఇందులో సుమారు 1 లక్షా 39 వేల 300 మంది వ్యక్తులు 8888888888 అనే మరో నంబర్‌తో కనెక్ట్ అయ్యారు, 96,046 మంది ఇతర వ్యక్తులు 90000000 నంబర్‌తో కనెక్ట్ అయినట్లు కూడా రిపోర్టులో పేర్కొన్నారు. ఇది కాకుండా, అటువంటి 20 నంబర్లు కూడా ముందుకు వచ్చాయి, వాటితో 10,000 నుండి 50,000 మంది లబ్ధిదారులను అనుసంధానించారు. కాగ్ రిపోర్టులో మొత్తం 7.87 కోట్ల మంది లబ్ధిదారులను ఈ విధంగా నకిలీ రిజిస్ట్రేషన్ పేరిట నమోదు జరిగినట్లు పేర్కొన్నారు.

ఫోన్ నంబర్ లేకపోతే చికిత్స చేయడంలో ఇబ్బంది తలెత్తే అవకాశం:
డేటాబేస్‌లో ఏదైనా లబ్ధిదారుడికి సంబంధించిన రికార్డులను కనుగొనడానికి మొబైల్ నంబర్ చాలా ముఖ్యమైనదని కాగ్ రిపోర్టు పేర్కొంది. ఫోన్ నెంబర్ ఉంటే ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కార్డు లేకుండానే రిజిస్ట్రేషన్ డెస్క్‌ను సంప్రదించవచ్చు. మొబైల్ నంబర్ తప్పుగా ఉన్నట్లయితే, ఈ-కార్డ్ పోయినట్లయితే లబ్ధిదారుని గుర్తించడం కష్టం కావచ్చు. అంటే దీని తర్వాత లబ్ధిదారుల పథకం ప్రయోజనం పొందడం దాదాపు అసాధ్యం. ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) ఈ ఆడిట్‌ను అంగీకరిస్తూ, BIS 2.0 అమలుతో ఈ సమస్య పరిష్కారమవుతుందని తన రిపోర్టు లో పేర్కొంది. BIS 2.0 సిస్టమ్ ఇటీవలే అమలు చేశారు, రిపోర్టు ప్రకారం, బెనిఫిషియరీ గైడ్‌బుక్‌లో ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు అతని మొబైల్ నంబర్ ద్వారా సంప్రదించడానికి ఒక నిబంధన ఉంది. కార్డును తయారు చేసే సమయంలో ఇచ్చిన నంబర్‌కు సందేశం పంపడం ద్వారా లబ్ధిదారుడికి అతని అర్హతను తనిఖీ చేయడానికి ఉపయోగపడుతుందనే నిబంధన కూడా మార్గదర్శకాల క్రింద ఉంది. BIS డేటాబేస్‌ను విశ్లేషించిన తర్వాత, ఒకే నంబర్‌లో లక్షల సంఖ్యలో పేర్లు నమోదయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు