CAA Online Portal: సీఏఏ కొత్త పోర్టల్ షురూ..త్వరలోనే మొబైల్ యాప్..ఏయో పత్రాలు ఉండాలంటే? పౌరసత్వ సవరణ చట్టం (CAA)చట్టం కింద దరఖాస్తు చేసుకునేవారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది. పౌరసత్వాన్నిఈ ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు ఉండాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. By Bhoomi 12 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CAA Online Portal: లోకసభ ఎన్నికలకు ముందు కేంద్రంలో మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. పాకిస్తాన్, అప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి భారత్ కు వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా సోమవారం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వశాఖ. ఈ క్రమంలోనే సీఏఏ కింద దరఖాస్తుల స్వీకరణ కోసం హోంశాఖ మంగళవారం కొత్తవెబ్ పోర్టల్ ను ప్రారంభించింది. ఆ వెబ్ పోర్టల్ ఇదే: https:/indiancitizenshiponline.nic.in పోర్టల్ ఒక్కటే కాదు త్వరలోనే యాప్ ను కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి వలస వచ్చిన శరణార్థుల దగ్గర ఎలాంటి పత్రాలు లేకున్నా..సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. మరి ఈ చట్టం కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. -ముందుగా వెబ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. https:/indiancitizenshiponline.nic.in -సీఏఏ, 2019 కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు నమోదు బటన్ పై నొక్కాలి. -ఇప్పుడు మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. తర్వాత పేజీ తెరుచుకుంటుంది. -అందులో మీ పేరు, మెయిల్ ఐడీ ఇతర వివరాలను నమోదు చేసి ఎంటర్ నొక్కాలి. -మీ మెయిల్ ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత ఎక్స్ ట్రా వెరిఫికేషన్ కోసం క్యాప్చా కోడ్ ను నమోదు చేయాలి. -వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత మీ పేరుతో లాగిన్ అయిన తర్వాత కొత్త అప్లికేషన్ బటన్ పై క్లిక్ చేయ ాలి. -ఇక్కడ మీ కు సంబంధించి వివరాలన్నింటిని నమోదు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పత్రాలు అవసరం? 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందు భారత్ కు వచ్చినట్లు రుజువు చేసే డాక్యుమెంట్లను ఇవ్వాలి. అంటే వీసా కాపీ, ఇమ్మిగ్రేషన్ స్టాంప్, రేషన్ కార్డు, భారత్ లో జన్మిస్తే జనన ధ్రువీకరణ పత్రం, రెంటల్ అగ్రిమెంట్, పాన్ కార్డు, విద్యుత్ బిల్లు, బీమా పాలసీ, ఈపీఎఫ్, మ్యారేజీ సర్టిఫికేట్ ఇలా ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించవచ్చు. ఇది కూడా చదవండి: నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా..! #caa-act-india #caa-website-registration #caa-registration-proces #caa-portal-india-website మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి