Buddha Venkanna : జగన్ జైలుకే.. ఆయనకు రంకుమొగుడు ఇతడే.. బుద్దా వెంకన్న సెన్సేషనల్ కామెంట్స్..! చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందేనని.. జగన్ జైలుకే పరిమితం అని కౌంటర్ వేశారు. కృష్ణా జిల్లాలో ఉన్న పిచ్చి కుక్కల్ని సైతం వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. By Jyoshna Sappogula 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి Buddha Venkanna : విజయవాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీపై పెట్రేగిపోయిన వైసీపీ నాయకులను వాళ్ళ నియోజకవర్గాలలో సొంత కార్యకర్తలే తరిమికొట్టారన్నారు. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబుని అసెంబ్లీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫినిష్ చేస్తానని అన్నారని.. కానీ భగవంతుడు వైఎస్ ను లేకుండా చేశాడని కామెంట్స్ చేశారు. Also Read: రక్షణ కల్పించండి.. మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన ట్వీట్..! జగన్ కూడా చంద్రబాబుపై అనేక వ్యాఖ్యలు చేశాడని.. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేవుడు చేశాడని అన్నారు. చంద్రబాబు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని..ఈ రోజు కేంద్రంలో కూడా చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నాడు అంటే అంతకంటే ఆనందం లేదన్నారు. ఇంకో 45 సంవత్సరాలు టీడీపీకి తిరుగు లేదన్నారు. పవన్ ను మూడు పెళ్లిళ్లు అని విమర్శించారని.. కానీ ఇప్పుడు జగన్ కు రంకుమొగుడు అయి కూర్చున్నాడని కౌంటర్ వేశారు. Also Read : 30 ఏళ్ల నాటి పొలిటికల్ సీన్ రిపీట్.. జగన్ కోలుకోవడానికి కనీసం పదేళ్లు? జగన్, కేటీఆర్ ఇద్దరూ కలిసి పోటీ చేసినా లోకేష్ కు వచ్చిన మెజార్టీ రాలేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలంతా లోకేష్ కు బ్రహ్మరథం పట్టారని.. జగన్ బిసి ల వ్యతిరేకి అని మండిపడ్డారు. జగన్ ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందేనని.. ఇంక జగన్ జీవితం జైలుకే పరిమితం అని కౌంటర్ వేశారు. జగన్ మూడు జన్మలెత్తినా సరే తరగని శిక్షలు పడతాయన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన ఈ కృష్ణా జిల్లాలో ఉన్న పిచ్చి కుక్కల్ని మాత్రం వదిలేది లేదని తేల్చిచెప్పారు. త్వరలోనే సజ్జల రామకృష్ణరెడ్డి జైలుకు వెళ్తాడన్నారు. #buddha-venkanna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి