RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హౌస్ అరెస్టుపై బీఎస్పీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని సిద్ధిపేట బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ డిమాండ్ చేశారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ సత్యాగ్రహ నిరాహార దీక్ష చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు సరైంది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

New Update
RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హౌస్ అరెస్టుపై బీఎస్పీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం

RS Praveen Kumar House Arresst:గ్రూప్-2 పరీక్ష (TSPSC Group 2)వాయిదా వేయాలంటూ సత్యాగ్రహ నిరాహార దీక్ష చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు చేయడం సరైంది కాదని సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు సంజీవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పరీక్షను వెంటనే వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండు వద్ద బీఎస్పీ నాయకులు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. కాసేపు వాహనాలు ఎక్కడివి అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాస్తారోకో చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితంతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. గతంలో నిర్వహించిన పరీక్షలకు పేపర్ లికేజ్ జరిగి విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు విద్యార్థులు కనీసం చదువుకోవడానికి సమయం ఇవ్వకుండానే పరీక్షలు నిర్వహిస్తామనడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. పరీక్ష రద్దు చేయాలంటూ రాష్ట్ర అధ్యక్షులు RS ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సత్యగ్రహ నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే ప్రవీణ్ కుమార్‌ను విడుదల చేసి గ్రూప్-2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో BSP ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసి విద్యార్థులకు అండగ ఉంటామన్నారు.

అంతకుముందు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని హైదరాబాద్ గన్ పార్క్(Hyderabad Gun Park) వద్ద శాంతి యుతంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ప్రకటించారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ప్రవీణ్ కుమార్ ఇంటికి వచ్చిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. పోలీసులు తనను బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో... ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు. కేసీఆర్ లాంటి నియంతలను తెలంగాణ గడ్డ ఎంతో మందిని చూసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రూప్-2 వాయిదా వేసే వరకు తమ పోరాటం కొనసాగుతోందని ఆయన స్పష్టంచేశారు.

"ఇప్పుడే 5 మంది పోలీసు ఉన్నతాధికారులు వచ్చి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం నన్ను గృహనిర్బంధంలోనే ఉంచమని ఆదేశాలిచ్చిందని చెప్పిపోయిండ్రు. తెలంగాణ గడ్డ కేసీఆర్ లాంటి నియంతలను ఎంతో మందిని చూసింది. ఈ తాటాకుల చప్పుళ్లకు భయపడే సవాలే లేదు. రేపు నేను నిరుద్యోగ బిడ్డల కోసం సత్యాగ్రహాన్ని ఇంట్లోనే కొనసాగిస్తాను. తెలంగాణ ప్రజలందరూ రేపు ఈ నిరంకుశ ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా ఎక్కడ ఉన్నా పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన తెలుపగలరని కోరుతున్నా" అని ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు .

Advertisment
Advertisment
తాజా కథనాలు