గిగ్ వర్కర్ల మంచిచెడ్డలు తెలుసుకున్న కేటీఆర్.. బోర్డు ఏర్పాటుకు హామీ

ఇటీవల వరుసగా సమాజంలోని వివిధ వర్గాలతో బేటీ అవుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం హైదరాబాద్ లో గిగ్ వర్కర్లతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్న కేటీఆర్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని, బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

New Update
గిగ్ వర్కర్ల మంచిచెడ్డలు తెలుసుకున్న కేటీఆర్.. బోర్డు ఏర్పాటుకు హామీ

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వినూత్నంగా కొనసాగిస్తున్నారు. గిగ్ వర్కర్లైన ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు; స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ ను సోమవారం ఆయన కలిసి మాట్లాడారు. వారి సమస్యలన్నీ వివరంగా తెలుసుకున్న కేటీఆర్ తప్పక వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డెలివరీ బాయ్స్, డ్రైవర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. గిగ్ వర్కర్ల కోసం బోర్డును కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని, ఇందుకోసం ఓ పథకాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఈ పథకానికి కార్యరూపం ఇస్తామన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వల్లే రైతు బంధు ఆగింది.. కేసీఆర్ గరం!

రోజుకో వర్గంతో బేటీ అవుతున్న మంత్రి కేటీఆర్ వారితో మాట్లాడుతూ సమస్యలను వివరంగా తెలుసుకుంటున్నారు. ఆయా రంగాలకు సంబంధించిన అన్ని అంశాలనూ వారితో సమగ్రంగా చర్చిస్తూ తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యాచరణను వివరిస్తూ వస్తున్నారు. గతంలో పలువురు ప్రముఖులతో ఇంటర్వ్యూలకు హాజరైన కేటీఆర్ పదేళ్లలో తమ ప్రభుత్వ విధానాలు, చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఆయన పలువురు ఇన్ఫ్లూయెన్సర్లతో కూడా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: సిగ్గూ శరం లేదు.. రేవంత్ పై దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు!

ఇటీవలే విద్యార్థులతో కూడా మంత్రి కేటీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే. జిల్లాకో డిజిటల్ లైబ్రరీ, పారదర్శకతతో పరీక్షల నిర్వహణపై వారికి హామీఇచ్చారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, జాబ్ క్యాలెండర్ అంశాలపై గతంలోనే కేటీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ బేటీల్లో భాగంగా యాప్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ తో బేటీ అయ్యారు. వారితో సమావేశమైన వీడియోను కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు