మరోసారి బానిసల్లా మారం.. నాగార్జునసాగర్ లో బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ గత 36 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డి తన కుటుంబం మొత్తాన్ని హైదరాబాద్‌లోనే ఉంచారని, ఇక్కడ కనీసం నివాసం కూడా లేదన్నారు. ఇప్పుడు ఆయన కొడుకు వచ్చి మండలానికి ఒకరికి బాధ్యతలు అప్పజెప్పి హైదరాబాద్‌లో ఉంటూ.. మరో 20 ఏళ్లు మమ్మల్ని బానిసలుగా మారుస్తారన్న భయం ప్రజల్లో ఉందన్నారు. ఆయన కొడుకు వచ్చినా, ఆయన వచ్చినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. By Sadasiva 11 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తన వెంటే ఉన్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఆర్‌టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.. ఎన్నికలంటే అందరికీ భయంగా ఉంటే తమకు మాత్రం సంబరంలా ఉందన్నారు. పండుగ వాతావరణంలో ప్రజలు తనను గెలిపించుకుంటామని చెబుతున్నారని నోముల తెలిపారు. ప్రతి గ్రామంలో నాయకులు, యువత తనను గెలిపించేందుకు ముందుకొస్తున్నారని, గత ఉప ఎన్నికల కంటే ఈసారి ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని వివరించారు. ఇక్కడ మేమే లోకల్.. గత 36 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డి తన కుటుంబం మొత్తాన్ని హైదరాబాద్‌లోనే ఉంచారని, ఇక్కడ కనీసం నివాసం కూడా లేదన్నారు. ఇప్పుడు ఆయన కొడుకు వచ్చి మండలానికి ఒకరికి బాధ్యతలు అప్పజెప్పి హైదరాబాద్‌లో ఉంటూ.. మరో 20 ఏళ్లు మమ్మల్ని బానిసలుగా మారుస్తారన్న భయం ప్రజల్లో ఉందన్నారు. ఆయన కొడుకు వచ్చినా, ఆయన వచ్చినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. లోకల్ అనే పదం మాట్లాడటానికి కూడా జానా కుటుంబానికి అర్హత లేదని.. ఏ రోజూ ప్రజలకు వారు అందుబాటులో లేరని, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదని నోముల భగత్ మండిపడ్డారు. 2014 నుంచి మేము ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని, లోకల్ ఎవరో నాన్ లోకల్ ఎవరో ప్రజలకు తెలుసన్నారు. నేనొచ్చాక డిగ్రీ కాలేజీ, బీసీ డిగ్రీ కాలేజీ వచ్చాయని, కోట్ల రూపాయలతో రోడ్లు, బ్రిడ్జిలు, లింకు రోడ్లు నిర్మించామన్నారు. జానారెడ్డి ముందే ఇవన్నీ చేసి వుంటే తనకు చేయాల్సిన అవసరం ఏమిటని మండిపడ్డారు. హాలియాలో పీహెచ్‌సీని అభివృద్ధి చేసి ప్రజలు ప్రతి చిన్న రోగానికి మిర్యాలగూడ, నల్గొండకు వెళ్లే బాధ తప్పించానన్నారు. విద్యార్థులు ఆడుకునేందుకు 6.5 ఎకరాల్లో 4 కోట్లతో స్టేడియం నిర్మించామని, ఇరిగేషన్ ప్రాజెక్టులూ మా హయాంలోనే వచ్చాయన్నారు. రోడ్లు, విద్యాసంస్థలు, హాస్పటల్స్, సాగునీటి ప్రాజెక్టులు అన్నీ మేము చేసినవేనని.. జానారెడ్డి ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తండ్రి ఆశయాలతో ముందుకు.. ఈసారి జానారెడ్డిని నియోజకవర్గం నుంచి తరిమికొట్టి మరో 20 ఏళ్లు ఇటువైపు రాకుండా ప్రజలు చేస్తారని నోముల భగత్ స్పష్టం చేశారు. తన పుట్టిన రోజు వేడుకలు బల ప్రదర్శన కాదని.. ప్రజలకు తన మీద ఉన్న అభిమానంతోనే పెద్ద ఎత్తున నిర్వహించారని తెలిపారు. ఏ పార్టీ అయినా సరే.. నా ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరి సమస్యనూ తీర్చానన్నారు. తన తండ్రి ఆశయాలతో ముందుకు వెళుతూ ప్రజలకు సేవలందించేందుకు కృషి చేస్తున్నానని భగత్ తెలిపారు. తనకు ఎవరి మీద ద్వేషం లేదన్నారు. టికెట్ కోసం నేతలు కొట్లాడుకోవడం కామన్ అని.. టికెట్ రాని వారికి ఆవేదన మామూలేనన్నారు. కొన్ని రోజులు ఆ బాధ ఉంటుందని.. అనంతరం కేసీఆర్ కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు. పార్టీ మారిన వారి గురించి ఆలోచించమని, తిరిగి వస్తే మళ్లీ పార్టీలోకి చేర్చుకుంటామని తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి