Krishank: ఓయూ పోలీసుల కస్టడీలో మన్నె క్రిశాంక్‌

TG: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. OU హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్‌తో దుష్ప్రచారం చేసిన ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన క్రిశాంక్‌ను నాంపల్లి కోర్టు అనుమతితో ఒక్కరోజు కస్టడీలోకి తీసుకున్నారు.

New Update
Krishank: కేసీఆర్‌కు నోటీసులు.. సీఎం రేవంత్ స్క్రిప్ట్.. క్రిశాంక్ హాట్ కామెంట్స్

BRS Social Media Incharge Krishank: బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మన్నె క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్‌తో దుష్ప్రచారం చేసిన ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన మన్నె క్రిశాంక్‌ను నాంపల్లి కోర్టు అనుమతితో ఒక్కరోజు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు రెండు రోజులు కస్టడీకి అనుమతి కోరగా న్యాయస్థానం ఒకరోజు అనుమతి ఇచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు క్రిశాంక్ తమ కస్టడీలో ఉండనున్నట్లు ఓయూ పోలీసులు చెప్పారు. ఫేక్ సర్క్యులర్ ఎలా తయారు చేశారు, ఎవరూ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు.

ALSO READ: 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం… రాహుల్ గాంధీ కీలక ప్రకటన

కస్టడీలోకి తీసుకున్నప్పుడు క్రిశాంక్ ఫోన్ కనిపించడం లేదని, దానిపై కూడా పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. క్రిశాంక్‌తో పాటు ఆయన అడ్వకేట్ లక్ష్మణ్ పీఎస్‌కు హాజరయ్యారు. క్రిశాంక్ ఫేక్ సర్క్యులర్ తయారు చేయలేదని, న్యూన్ సరిక్యులర్ పోస్టు చేశానని, లాస్ట్ ఇయర్ చీఫ్ వార్డెన్ జారీ చేసిన సర్క్యులర్ మాత్రమే పోస్టు చేశానని చెప్తున్నాడని తెలిపారు. దానిమీదనే తాను వాదనలు వినిపిస్తున్నట్లు చెప్పారు. ఆ డాక్యుమెంట్స్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిస్తే క్రిశాంక్ సంతకాలు ఫోర్జరీ చేశాడా లేదా అన్న విషయం తెలుస్తుందన్నారు.

అంతకు ముందు ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్య పరీక్షల అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే, విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, క్రిశాంక్ భద్రతపై ఆయన భార్య సుహాసిని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు మొత్తం బహిర్గతంగా ఉందని, అలాంటప్పుడు పోలీస్ కస్టడీ అవసరం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ కేసును ఎందుకు పక్క దోవ పట్టిస్తున్నారని నిలదీశారు. ఓయూ పేరుతో ఫేక్ లెటర్‌ని సోషల్ మీడియాలో క్రిశాంక్ సర్క్యులేట్ చేశారని, ఓయూ ఖ్యాతిని అప్రతిష్టపాలు చేశారని మన్నె క్రిశాంక్‌పై ఓయూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు