నా ఫోన్‌ హ్యాక్‌ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చి నాలుగు రోజులు అయిందో లేదో అప్పుడే తమకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
నా ఫోన్‌ హ్యాక్‌ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

Marri Rajashekhar Reddy: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చి నాలుగు రోజులు అయిందో లేదో అప్పుడే తమకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కార్పొరేటర్లు, నాయకులకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, ఆన్‌లైన్‌ను ఉపయోగించి కొందరు దుండగులు స్పూఫ్‌ కాల్స్‌ చేస్తూ కుటుంబాలను నాశనం చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. దీనిపై మేడ్చల్‌ జిల్లా నేరేడ్‌మెట్‌లో రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. త్వరలో దుండగులపై చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: కుర్ర టీం కుమ్మేసింది.. అండర్-19 ఆసియాకప్‌లో భారత్ శుభారంభం

నా ఫోన్ హ్యాక్ చేశారు:
తన ఫోన్ హ్యాక్ అయిందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. అసలు విషయం ఏంటంటే.. గత రెండు రోజులుగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అనుచరులైన కార్పొరేటర్లకు మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నుంచి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో బెదిరింపు కాల్స్ వచ్చిన కార్పొరేటర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ప్రస్తుత మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.. తన ఫోన్ హ్యాక్ చేశారని ఆరోపించారు.

తాను ఎవరికి బెదిరింపు కాల్స్ చేయలేదని తేల్చి చెప్పారు. తనపై బురద జల్లేందుకు కొందరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. మర్రి రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు అనే విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు