MLC Kavitha: ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్

TG: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కవితను కలిశారు. కాగా లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

New Update
MLC Kavitha: ఢిల్లీ ఎయిమ్స్‌కు కవిత.. కోర్టు కీలక ఆదేశాలు

MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కవితను కలిశారు. కాగా లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ALSO READ: రాహుల్ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న.. ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

మే 24 వరకు జైలులోనే..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు కవిత వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 24కు వాయిదా వేసింది. కాగా ఎమ్మెల్సీ కవిత మరికొన్ని రోజులు జైలులో ఉండనున్నారు. 

మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నమోదు చేసిన అవినీతి కేసులో తనను విడుదల చేయడంతోపాటు అరెస్టుకు దారితీసిన మొత్తం చర్యలను సవాలు చేస్తూ బిఆర్ఎస్ నాయకురాలు  కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసు జారీ చేసింది. కవిత ప్రస్తుతం సీబీఐ, ఈడీ కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోసం ఆమె వేసిన పిటిషన్‌ ను ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది.

కవితను మార్చి 15 సాయంత్రం ఈడీ అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్టు చేసిన సమయంలో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దీంతో జైలులో కవితను విచారించేందుకు సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు