BRS first list viral:సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ వైరల్..మరోవైపు కొంత మంది సిట్టింగులకు బాస్ చెక్ పెట్టేరా!!

మొదటి శ్రావణ సోమవారం రోజున ఫస్ట్ లిస్ట్ ను అట్టహాసం విడుదల చేయడానికి బీఆర్ఎస్ రెడీ అయింది. అయితే ఎప్పటి లాగే ఈ సారి కూడా జాబితా విషయంలో గులాబీ బాస్ లక్కీ నెంబర్ 6 ను ఫాలో అవుతున్నారు. ఈ లిస్ట్ లో దాదాపుగా సిట్టింగులకే ప్రాధాన్యత ఇచ్చినట్టు చర్చ జోరుగా సాగుతోంది. వివాదాస్పదమైన స్టేషన్ ఘన్ పూర్ లాంటి రెండు మూడు నియోజకవర్గాల విషయంలో మాత్రం బాస్ కొత్తవారికి ఛాన్స్ ఇచ్చినట్టుగా కూడా ప్రచారం సాగుతోంది. మరోవైపు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ఈ సారి కొంత మంది సిట్టింగులకు చెక్ పడనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

New Update
BRS first list viral:సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ వైరల్..మరోవైపు కొంత మంది సిట్టింగులకు బాస్ చెక్ పెట్టేరా!!

BRS First List Viral: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో స్పీడ్ పెంచిన కారు పార్టీ బరిలోకి దింపనున్న అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేసింది. ఈ నెల 21 న అంటే మొదటి శ్రావణ సోమవారం రోజున ఫస్ట్ లిస్ట్ ను అట్టహాసం విడుదల చేయడానికి బీఆర్ఎస్ (BRS) రెడీ అయింది. అయితే ఎప్పటి లాగే ఈ సారి కూడా జాబితా విషయంలో గులాబీ బాస్ లక్కీ నెంబర్ 6 ను ఫాలో అవుతున్నారు. దీంతో 80 నుంచి 90 మంది పేర్లతో కూడుకున్న మొదటి లిస్ట్ ను ప్రిపేర్ చేసినట్టు సమాచారం.

ఇక ఇలా ఉంటే.. ఈ లిస్ట్ లో దాదాపుగా సిట్టింగులకే ప్రాధాన్యత ఇచ్చినట్టు చర్చ జోరుగా సాగుతోంది. వివాదాస్పదమైన స్టేషన్ ఘన్ పూర్ లాంటి రెండు మూడు నియోజకవర్గాల విషయంలో మాత్రం బాస్ కొత్తవారికి ఛాన్స్ ఇచ్చినట్టుగా కూడా ప్రచారం సాగుతోంది. అయితే మిగతా పార్టీల కంటే కన్నా ముందుగా జాబితాను రిలీజ్ చేయాలని భావిస్తున్న బీఆర్ఎస్ బాస్ ఫస్ట్ లిస్ట్ లో వివాదాలు లేని స్థానాలను ఎంచుకున్నారు. మరోవైపు సెకండ్ లిస్ట్ పై కూడా కసరత్తు నడుస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ఈ సారి కొంత మంది సిట్టింగులకు చెక్ పడనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఆ లిస్ట్ విషయానికొస్తే...

హైదరాబాద్‌

కాలేరు వెంకటేశ్‌ - అంబర్‌పేట

ముఠా గోపాల్‌ -ముషీరాబాద్‌

రంగారెడ్డి

బేతి సుభాష్‌రెడ్డి - ఉప్పల్‌

మెదక్

చిలుముల మదన్‌రెడ్డి  - నర్సాపూర్‌

కె.మాణిక్‌రావు - జహీరాబాద్‌

కరీంనగర్‌

1) సుంకే రవిశంకర్‌ - చోప్పదండి

2) చెన్నమనేని రమేశ్‌ - వేములవాడ

3) పుట్ట మధు - మంథని

4) కోరుకంటి చందర్‌ - రామగుండం

5) డాక్టర్‌ సంజయ్‌ - జగిత్యాల

వరంగల్‌

తాటికొండ రాజయ్య - స్టేషన్‌ ఘన్‌పూర్‌

ముత్తిరెడ్డి  యాదగిరి రెడ్డి - జనగామ

మహబూబ్‌నగర్‌

జైపాల్‌ యాద్‌ - కల్వకుర్తి

నల్లగొండ

నోముల భగత్‌ - నాగార్జునసాగర్‌

కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి - మునుగోడు

ఖమ్మం

రాములు నాయక్‌ - వైరా

హరిప్రియ నాయక్‌ - ఇల్లందు

ఆదిలాబాద్‌ జిల్లా

1)  రేఖా నాయక్‌ - ఖానాపూర్‌

2) దుర్గం చిన్నయ్య -  బెల్లంపల్లి

మరో వైపు సోషల్ మీడియాలో ఓ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ పేరుతో చక్కర్లు కొడుతోంది. అందులో ఎవరెవరు ఉన్నారంటే..

  1. సిర్పూర్ – కోనేరు కోనప్ప
  2. ఆదిలాబాద్ - జోగురామన్న
  3. నిర్మల్ - ఇంద్రకరణ్ రెడ్డి
  4. సిరిసిల్ల - కేటీఆర్
  5. హుస్నాబాద్ – సతీష్ బాబు
  6. హుజురాబాద్ – కౌశిక్ రెడ్డి
  7. కరీంనగర్ – గంగుల కమలాకర్
  8. కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్
  9. సిద్ధిపేట్ – హరీశ్ రావు
  10. నారాయణఖేడ్ – భూపాల్ రెడ్డి
  11. దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి
  12. పటాన్ చెరు – మహిపాల్ రెడ్డి
  13. నాగర్ కర్నూల్ – మర్రి జనార్థన్ రెడ్డి
  14. దేవరకద్ర – ఆల్ల వెంకటేశ్వర రెడ్డి
  15. మహబూబ్ నగర్ – శ్రీనివాస్ గౌడ్వ
  16. నపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
  17. కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్ రెడ్డి
  18. నారాయణ పేట – రాజేందర్ రెడ్డి
  19. జడ్చర్ల – లక్ష్మారెడ్డి
  20. కూకట్ పల్లి– మాధవరం కృష్ణారావు
  21. శేరిలింగంపల్లి–అరికెపూడి గాంధీ
  22. .మహేశ్వరం– సబితా ఇంద్రారెడ్డి
  23. మేడ్చల్– మల్లారెడ్డి
  24. మల్కాజిగిరి–మైనంపల్లి
  25. తాండూరు – రోహిత్ రెడ్డి
  26. .వికారాబాద్ – మెతుకు ఆనంద్
  27. సికింద్రాబాద్ – పద్మారావు గౌడ్
  28. సనత్ నగర్– తలసాని శ్రీనివాస్ యాదవ్
  29. మిర్యాల గూడ – భాస్కర్ రావు
  30. తుంగతుర్తి – గ్యాదరి కిషోర్
  31. .హుజూర్ నగర్– సైదిరెడ్డి
  32. నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య
  33. సూర్యాపేట్– జగదీశ్వర్ రెడ్డి
  34. దేవరకొండ – రవీంద్ర నాయక్
  35. .స్టేషన్ ఘన్ పూర్ – కడియం శ్రీహరి
  36. వరంగల్ వెస్ట్ – దాస్యం వినయ్ భాస్కర్
  37. భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి
  38. వర్ధన్నపేట – ఆరూరి రమేశ్
  39. పాలకుర్తి – ఎర్రబెల్లి
  40. పరకాల – చల్లాధర్మారెడ్డి
  41. నర్సంపేట్ – పెద్ది సుదర్శన్ రెడ్డి
  42. ఖమ్మం – పువ్వాడ అజయ్
  43. సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య
  44. అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వర రావు
  45. పినపాక– రేగా కాంతారావు
  46. ఆర్మూర్ – జీవన్ రెడ్డి
  47. బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి
  48. బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి
  49. జుక్కల్ – హన్మంత్ షిండే
  50. గజ్వేల్ – కేసీఆర్
  51. ఎల్బీ నగర్ – సుధీర్ రెడ్డి

అయితే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ లలో సిట్టింగులలో కొంత మందికి ఈ సారి సీట్ దక్కకపోవచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదే విధంగా ఫస్ట్ లిస్ట్ కింద 80 నుంచి 90మంది అభ్యర్థుల పేర్లతో కూడా ఓ జాబితా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఈనెల 21 న బీఆర్ఎస్ అధినాయకత్వం విడుదల చేసే మొదటి జాబితా పై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ పేరు ఉంటుందో లేదోనని సిట్టింగులతో పాటు..ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది.

Also Read: టీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఇలా చేయాల్సిందే? 25 వరకూ గడువు

Advertisment
Advertisment
తాజా కథనాలు