కేసీఆర్ సర్కార్ కు మళ్ళీ షాకిచ్చిన తమిళి సై..ఆర్టీసీ బిల్లుకు నో..!! రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ నడుస్తున్న వార్ లో గవర్నర్ తమిళి సై కేసీఆర్ సర్కార్ కు వరుసగా షాకులిస్తూనే వస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ ను ఇరుకున పెట్టేస్త్తున్నారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళి సై ఆమోద ముద్ర వేయలేదు. By P. Sonika Chandra 04 Aug 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ నడుస్తున్న వార్ లో గవర్నర్ తమిళి సై కేసీఆర్ సర్కార్ కు వరుసగా షాకులిస్తూనే వస్తున్నారు. తనకు ఛాన్స్ దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ ను ఇరుకుల్లో పడేస్తున్నారు తమిళి సై. తాజాగా మరోసారి ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ శాసన సభ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళి సై ఆమోద ముద్ర వేయలేదు. ఇక ఆర్థికపరమైన బిల్లు కావడంతో ప్రభుత్వం తప్పని సరి పరిస్థితుల్లో గవర్నర్ కు పంపాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వానికి మరోసారి గవర్నర్ దగ్గర్నుంచి చుక్కెదురైంది. మరో వైపు గవర్నర్ ఇప్పటికే తిప్పి పంపిన బిల్లులపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లులను మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్ కు పంపాలని నిర్ణయించింది. మరోవైపు గవర్నర్ కావాలనే ఉద్దేశపూర్వకంగానే బిల్లులను పెండింగ్ లో పెడుతున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. మొత్తం 10 బిల్లులకు, మూడు బిల్లులను గవర్నర్ ఆమోదించారు. రెండింటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. మరో రెండు బిల్లులపై ప్రభుత్వం వివరణ కోరారు గవర్నర్. మిగిలిన మూడు బిల్లుల్లో ఒక బిల్లును ఆమె తిప్పి ప్రభుత్వానికి పంపారు. అయితే ఇలా బిల్లుల వ్యవహారంలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ నడుస్తున్న వార్ లో బీఆర్ఎస్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిర్ణీత వ్యవధిలోగా బిల్లులు గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి