బ్రేకింగ్: టీఎస్ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!! కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ఛాన్స్..

ఎట్టకేలకు టీఎస్ ఆర్టీసీ బిల్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. గవర్నర్ తమిళి సై ఆర్టీసీ బిల్ కు ఆమోద ముద్ర వేశారు. హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు . దీంతో కాసేపట్లో ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టే ఛాన్స్...

New Update
బ్రేకింగ్: టీఎస్ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!! కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ఛాన్స్..

ఎట్టకేలకు టీఎస్ ఆర్టీసీ బిల్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. గవర్నర్ తమిళి సై ఆర్టీసీ బిల్ కు ఆమోద ముద్ర వేశారు. కాగా, ఈ బిల్లు విషయంలో తాను వ్యతిరేకం కాదని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని, శ్రేయస్సునే కోరుకుంటున్నానని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిన డ్రాఫ్టు బిల్లులో కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని..ప్రభుత్వం నుంచి రెండు దఫాలుగా క్లారిటీ వచ్చిందన్నారు.

అయినా కాని కొన్ని నివృత్తి కావాల్సిన అవసరం ఉందనడంతో.. ఈ రోజు ఆర్టీసీ ఉన్నతాధికారులను రాజ్ భవన్ కు పిలిపించుకున్నానని ఆమె మాట్లాడారు. వారితో చర్చించిన తమిళి సై బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే బిల్లు పై గవర్నర్ వ్యక్తం చేసిన 5 సందేహాలకు ప్రభుత్వం తరుపు నుంచి ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మొత్తానికి ఆర్టీసీ బిల్ కు గవర్నర్ నుంచి ఆమోదం లభించడంతో.. ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాసేపట్లో ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి.

(This is an updating story)

Advertisment
Advertisment
తాజా కథనాలు