CM Jagan: సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్..! పశ్చిమ గోదావరి తేతలి వద్ద సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. రేపు ఉదయం వరకు జగన్ తేతలి శిబిరం వద్ద విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది. గోదావరి జిల్లాల నుంచి నాయకులు సీఎంను కలిసేందుకు వచ్చారు. కానీ, ఆయనను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. By Jyoshna Sappogula 17 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి CM Jagan: ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సభలు నిర్వహిస్తూ ప్రతిపక్ష్యాలపై విరుచుకుపడుతున్నారు. అయితే, తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వద్ద సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ పడింది. రేపు ఉదయం వరకు సీఎం జగన్ తేతలి వద్దే వుండనున్నారు. శిబిరం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ బస చేస్తున్న ప్రాంతం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. Also Read: నా ఫోన్‌లను బీఆర్‌ఎస్ ట్యాప్ చేసింది.. బలమైన ఆధారాలున్నాయి! సీఎంను కలిసేందుకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శిబిరం వద్దకు చేరుకున్నారు. అయితే, సీఎంను కలిసేందుకు అనుమతి లేదంటూ భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో, నాయకులు మౌనంగా వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.మరల రేపు ఉదయం అంబేద్కర్ కోమసీమ జిల్లా రావులపాలెం వద్ద జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. #cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి