పవన్ ని ఆకాశానికి ఎత్తేసిన బ్రహ్మి..దైవాంశ సంభూతుడంటూ కితాబు..!

బ్రో..పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం. ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వచ్చే శుక్రవారం (జులై 28)న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.అయితే మంగళ వారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో బ్రో ప్రీ రిలీజ్‌ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దైవాంశ సంభూతుడని అభివర్ణించారు.

New Update
పవన్ ని ఆకాశానికి ఎత్తేసిన బ్రహ్మి..దైవాంశ సంభూతుడంటూ కితాబు..!

బ్రో..పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం. ప్రముఖ దర్శకుడు నటుడు వి.సముద్రఖని దర్శకసారధ్యంలో పీపుల్స్ మీడియా బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం. వచ్చే శుక్రవారం (జులై 28)న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.అయితే మంగళ వారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో బ్రో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అట్టహాసంగా నిర్వహించారు.

publive-image

సినిమా యూనిట్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టార్ కమెడియన్‌ బ్రహ్మానందం, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ తదితరులు బ్రో ఈవెంట్‌లో సందడి చేశారు.

అయితే బ్రో సినిమాలో బ్రహ్మానందం నటిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హాస్యబ్రహ్మ పవన్ ని పొగడంలో ఒక అడుగు ముందుకేశారు. బ్రహ్మీ మాట్లాడుతూ పవన్‌ తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని, మంచి మనసు ఉన్న వ్యక్తి అని బ్రహ్మి కితాబిచ్చారు.

‘బ్రో సినిమాలో ది గ్రేట్‌ పవన్‌ కల్యాణ్‌తో ఒక చిన్న పాత్ర చేయడం నా అదృష్టం. మీరందరూ ఇలా చప్పట్లు కొట్డం కాదు.. మీ అందరి ఆశీస్సులు పవర్‌స్టార్ పై ఉండాలి. చప్పట్లు కొట్టడం కాదు.. ఆయన విజయాలకు అన్ని విధాలా మనం తోడ్పడాలి.

పవన్‌ను 20 ఏళ్ల వయస్సు నుంచి చూస్తున్నాను. పత్తికాయ పగిలి.. తెల్లటి పత్తి బయటకు వచ్చినప్పుడు.. ఎంత తెల్లదనం ఉంటుందో.. పవన్‌లో నవ్వులో అంతటి అందం ఉంది. మనిషంతా మంచి తనం.

కావాలనుకునేవారికి ఇష్టమైన అవతారంలో కనిపించగల దైవాంశ సంభూతుడు పవన్‌. తన గురించి మాట్లాడగలిగే అతి తక్కువ వ్యక్తుల్లో నేను ఒకరిని. బ్రో మూవీ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు బ్రహ్మానందం.

Advertisment
Advertisment
తాజా కథనాలు