Brahmamudi Serial: రగిలిపోతున్న అనామిక.. శోభనం క్యాన్సిల్.. కావ్యే కారణమంటూ నిందలు బ్రహ్మముడి సీరియల్ లో కళ్యాణ్, అనామిక శోభనం క్యాన్సిల్ అవుతుంది. భర్తతో గొడవ పడి బెడ్ రూం నుండి బయటకి వచ్చి హాల్ లో పడుకుంటుంది అనామిక. కళ్యాణ్ ఎప్పుడు అప్పు, కావ్య ప్రస్తావన తెస్తున్నాడంటూ ఇంట్లో పెద్దలకు చెబుతుంది. దీంతో కావ్యపై అత్త ధాన్యలక్ష్మి మరోసారి ఫైర్ అవుతుంది. By Jyoshna Sappogula 15 Jan 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Brahmamudi Serial Today Episode: హీరోయిన్ కావ్య తన మరిది కళ్యాణ్, అనామికల శోభనానికి ఏర్పట్లు చేసేందుకు సిద్దం అవుతుండగా అత్త ధాన్యలక్ష్మి వచ్చి అడ్డుకుంటుంది. 'నా కొడుకు కోడలు ఇష్టపడి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.. వాళ్లు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.. దయచేసి ఈ శోభనం విషయంలో కలుగజేసుకోనని మాటివ్వూ' అని అంటుంది. దీంతో కావ్య శోభనం ఏర్పట్లకు దూరంగా ఉంటుంది. రెచ్చిపోతున్న అనామిక.. అప్పుడే కళ్యాణ్ వచ్చి అనామిక కోసం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను.. వదినా.. పెళ్లి అయ్యాక నేను ఇచ్చే మొదట గిఫ్ట్.. అందుకే మన కంపెనీలోనే స్పెషల్‌గా డిజైన్స్ చేయించాను.. కానీ ఈ రెండిటిలో ఏది ఇవ్వాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నా.. కొంచెం సాయం చెయ్యారా? అని కావ్యను అడుగుతాడు. కావ్య సెలక్ట్ చేసిన నెక్లెస్ ను తీసుకుని అనామికకు ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. శోభనం గదిలోకి వెళ్లిన కళ్యాణ్ అనామికకు నెక్లెస్ట్ ను గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసి హ్యాపిగా ఫీల్ అవుతుంది. కానీ ఇంతలోనే కళ్యాణ్.. నీకు ఏది నచ్చుతుందో లేదోనని తెలియక మా వదినను అడిగితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసిందని అంటాడు. ఇక అనామిక కళ్యాణ్ తో గొడవ స్టార్ట్ చేస్తుంది. నువ్వు మన మధ్యకు అప్పుని, కావ్యని ఎందుకు తీసుకొస్తున్నావ్? అంటూ రెచ్చిపోతుంది. షాక్ లో కుటుంబసభ్యలు నువ్వు అనవసరంగా గొడవను పెద్దది చేస్తున్నావ్ అనామికా అంటాడు కళ్యాణ్ సీరియస్ అవుతాడు. దీంతో పిల్లో అందుకుని శోభనం మంచం మీదున్న పువ్వుల్ని చెల్లాచెదురు చేసి నక్లెస్‌ని విసిరి పడేస్తుంది. తరువాత అనామిక హాల్లో సోఫా మీద పడుకుని ఉంటుంది. అది చూసిన రుద్రాణి ఇంట్లో అందరినీ పిలిచి చూపిస్తుంది. శోభనం గదిలో ఉండాల్సింది ఇలా సోఫాలో పడుకుందేంటి? అని అందరూ షాక్ అవుతారు. అత్త ధాన్యలక్ష్మి ఏమైంది అనామిక నీకు ఏ కష్టం వచ్చింది? అంటూ ప్రేమగా అడుగుతుంది. కళ్యాణ్ ఎప్పుడు అప్పు, కావ్య ప్రస్తావన తెస్తున్నాడు ఆంటీ అంటూ ఏడుస్తూ చెబుతుంది. ఇక అత్త ధాన్యలక్ష్మి కావ్యపై నిప్పులు చెరుగుతుంది. పెళ్లి క్యాన్సిల్ చేయడానికి చూశావ్..పూజ చెడగొట్టావు..మళ్లి శోభనం చెడగొట్టావా? అంటూ తిడుతుంది. Also Read: బుద్ధిలేని హీనులే ఇలా చేస్తారు.. జగన్ కు మోహన్ బాబు కౌంటర్ #brahmamudi-serial మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి