/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Botsa-Satyanarayana.jpg)
Botsa Satyanarayana: ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ నా? అని అన్నారు. ఆయనొక క్యాష్ పార్టీ అని చురకలు అంటించారు. 2019 లో భ్రమలో ఉండి ఆయన్ని తెచ్చుకున్నాం ... ఆయన కమర్షియల్ అని తరవాత తెలిసిందని పేర్కొన్నారు. జిమ్మిక్కులు, చిట్కాలు ఒకసారి మాత్రమే పని చేస్తాయి.. జగన్ కి కావాల్సింది జిమ్మక్కులు కాదు అని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ వన్ టైం సెటిల్‌మెంట్ అని ఫైర్ అయ్యారు. రెండవ సారి నమ్మడానికి లేదని విమర్శించారు. క్యాష్ ఎవరు ఇస్తే వాళ్ళ తరపున ప్రశాంత్ మాట్లాడతాడని ఫైర్ అయ్యారు. "ఐప్యాక్ టీమ్ సేవలు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకున్నాం.. మా పార్టీ అధ్యక్షుడు మాకు సుప్రీం.. వైసీపీ పార్టీ శాశ్వతం... అధ్యక్షుడు జగన్ శాశ్వతం.. నాయకులు, కార్యకర్తలు శాశ్వతం... మిగతావన్నీ తాత్కాలికమే" అని బొత్స పేర్కొన్నారు.