Bomb Threat: బెంగుళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్

బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. వెంటనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్,సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు.

New Update
Bomb Threat: బెంగుళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్

Bomb Threat: బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సిబ్బంది భవనంలోని విశ్రాంతి గదిలో బుధవారం ఉదయం బాంబు బెదిరింపు సందేశం భయాందోళనకు గురి చేసింది. ఆల్ఫా 3 బిల్డింగ్‌లోని బాత్రూం మిర్రర్‌పై బాంబ్ పేలుతుందంటూ రాశాడు గుర్తు తెలియని ఆగంతకుడు. 25 నిమిషాల్లో విమానాశ్రయ నిర్వహణ, సిబ్బంది కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని పేలుడు జరుగుతుందని బాత్రూం అద్దంపై రాశాడు.

బెదిరింపు సందేశాన్ని గుర్తించిన విమానాశ్రయ ఉద్యోగి వెంటనే భద్రతా బలగాలను అప్రమత్తం చేశాడు. డాగ్ స్క్వాడ్,సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులతో సహా భద్రతా సిబ్బంది ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో సందేశం తక్షణ ప్రతిస్పందనను ప్రేరేపించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు