BREAKING: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెసేజ్

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. GMR కస్టమర్ కేర్ నెంబర్ కు ఆగంతకుడు మెసేజ్ చేశాడు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు హైఅలెర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు సమాచారం.

New Update
BREAKING: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెసేజ్

SHAMSHABAD AIRPORT BOMB: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. GMR కస్టమర్ కేర్ నెంబర్ కు ఓ ఆగంతకుడు మెసేజ్ చేశాడు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు హైఅలెర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆ గుర్తు తెలియని ఆగంతుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ: టార్గెట్ జగన్.. ప్రజల్లోకి పవన్ కళ్యాణ్

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..

విదేశాల నుంచి మనదేశానికి అక్రమంగా డ్రగ్స్ తీసుకొచ్చి ఎయిర్‌పోర్ట్‌లలో దొరికిపోవడం సర్వసాధారణమైపోయింది. అధికారులు ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా.. ఎన్నిసార్లు నిందితులను అరెస్టు చేసినా కూడా మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే తాజాగా శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటకర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. అయితే ఈసారి అధికారులను షాక్‌ గురి చేసింది ఓ మహిళ. 

Also Read: కేసీఆర్ పని అయిపోయిందని.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

రూ.41.4 కోట్లు

విదేశాల నుంచి ఆమె 5.92 కిలోల హెరాయిన్‌ను తరలించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఎప్పట్లాగే భద్రతా సిబ్బంది గుర్తుపట్టి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హెరాయిన్ విలువ రూ.41.4 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ మహిళా జాంబియా నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆమెను తనిఖీ చేయడంతో డ్రగ్స్ బయటపడినట్లు పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పరిచయాలా

ప్రస్తుతం ఆ సౌతాఫ్రికా మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇదిలాఉండగా.. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఎవ్వరికి ఇవ్వాలనుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పట్టుబట్ట మహిళతో ఎవరికైనా పరిచయాలున్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు.

DO WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు