Anantnag encounter: కశ్మీర్‌లో బాంబుల మోత.. ఎలా మోగుతుందో అంటే..?

దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు సరిహద్దుల గుండా భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను సరిహద్దుల్లోనే హతమార్చేందుకు సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. భారత సైన్యాన్ని టార్గెట్‌ చేసిన ఉగ్రవాదులను అంతమెందించేందుకు నాలుగు రోజులుగా కాల్పుల మోత మోగిస్తోంది.

New Update
Anantnag encounter: కశ్మీర్‌లో బాంబుల మోత.. ఎలా మోగుతుందో అంటే..?

Anantnag encounter: దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు సరిహద్దుల గుండా భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను సరిహద్దుల్లోనే హతమార్చేందుకు సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. భారత సైన్యాన్ని టార్గెట్‌ చేసిన ఉగ్రవాదులను అంతమెందించేందుకు నాలుగు రోజులుగా కాల్పుల మోత మోగిస్తోంది. మరోవైపు భారత సైన్యం టార్గెట్‌గా ఉగ్రవాదులు సైతం బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. కశ్మీర్‌లోని అనంతనాగ్ సెక్టార్‌లో నాలుగు రోజులుగా బుల్లెట్లు, బాంబుత మోత మోగుతోంది. స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారత సైన్యం ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెబుతోంది.

అనంతనాగ్‌లోని కొంత ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కుని.. భారత సైన్యంపై కాల్పుల మోత మోగిస్తున్నారు. సరిహద్దుల నుంచి తప్పించుకుని భారత్‌లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు వేసిన ప్లాన్‌ను పటాపంచెలు చేస్తూ ఇండియన్‌ ఆర్మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉగ్రవాదుల ఆట కట్టిస్తోంది. డ్రోన్ల సాయంతో ఉగ్రవాదుల ఆచూకీ కనిపెట్టి.. సరిగ్గా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా దాడులు చేస్తోంది. డ్రోన్‌ నిఘా ఆధారంగా ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశంపై భద్రతా బలగాలు మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని కోకెర్‌నాగ్ ప్రాంతంలోని గాడోల్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీకి చెందిన 19 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోచక్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయూన్ భట్, ఒక సైనికుడు వీరమరణం పొందారు.

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన టెర్రరిస్టు మాడ్యూల్‌ను ఛేదిస్తున్నప్పుడు, ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను అరెస్టు చేశారు. వారి నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఆర్మీ, ఓ పోలీసు అధికారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. అనంతనాగ్ జిల్లాలో మంగళవారం రాత్రి మొదలైన జాయింట్ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

దట్టమైన అటవీ ప్రాంతమైన కోకెర్ నాగ్‌లో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఆర్మీ కల్నల్ సింగ్, మేజర్ ధ్యాంచెక్ తోపాటు జమ్మూ కశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన డీఎస్పీ అధికారి హిమయూన్ భట్ ఉగ్రవాదుల కాల్పులతో తొలుత మరణించారు. దీంతో అప్పటి నుంచి జాయింట్ ఆపరేషన్ ఉద్ధృతంగా కొనసాగుతూనే ఉంది. అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తున్నారు. డ్రోన్లతో బాంబులు వదులుతున్నారు. దట్టమైన అడవిలో నక్కిన ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. భారత సైన్యానికి చెందిన అధికారుల మరణంతో ఆర్మీ ఉగ్రవాదులను ఏరివేసే పనిలో పడింది. నాలుగు రోజులుగా అనంతనాగ్ సెక్టార్‌లో బాంబుల మోత మోగుతోంది.

ఇది కూడా చదవండి: నా చిన్ననాటి బస్సు దొంగతనం అయింది.. పోలీసులకు ఆనంద్ మహీంద్ర ఫిర్యాదు

Advertisment
Advertisment
తాజా కథనాలు