Srisailam Power House: శ్రీశైలం పవర్‌ హౌస్‌లో పేలుడు!

TG: శ్రీశైలం పవర్ హౌస్‌లో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఏడో నంబర్‌ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించింది. ఈరోజు ఒక్కసారిగా విద్యుత్ కేంద్రంలో భారీ శబ్దాలు వినిపించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. భారీ పేలుడు శబ్దాలు రావడంతో అందులో పని చేసే కార్మికులు బయటకు పరుగులు తీశారు. పేలుడు శబ్దంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విద్యుత్ ఉత్పత్తిని ఆపేశారు. సాంకేతిక లోపం తలెత్తడంతో ఏడో నంబర్‌ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీశైలానికి తగ్గుతున్న వరద..

శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల చేశారు అధికారులు. ఇన్ ఫ్లో 99,615 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,81,235 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 883.5 అడుగులు వద్ద ఉంది.

2020లోనూ ప్రమాదం..
2020లోనూ శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు రావడంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది అగ్నికి ఆహుతి అయ్యారు.

Also Read : ఎంపీ విజయసాయి రెడ్డికి అధికారులు షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు